NTV Telugu Site icon

Bengaluru Techie Suicide: అర్ధరాత్రి ఇంటి నుంచి పరారైన అతుల్ సుభాష్ భార్య కుటుంబం..

Bengaluru Techie Suicide

Bengaluru Techie Suicide

Bengaluru Techie Suicide: బెంగుళూర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య ఉదంతం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. భార్య, ఆమె కుటుంబ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. ఈ కేసులో భార్య నికితా సింఘానియా కుటుంబంపై సమాజం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నికితా కుటుంబం అర్ధరాత్రి తమ ఇంటికి తాళాలు వేసి, పరారయ్యీరు. సుభాష్ ఆత్మహత్య కేసులో బెంగళూర్ పోలీసులు నికితాతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై BNS సెక్షన్‌లు 108 మరియు 3(5) కింద కేసులు నమోదు చేశారు. దీంతో వారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు యూపీ జౌన్‌పూర్ లోని వారి ఇంటి నుంచి పారిపోయారు. నికితా తల్లిదండ్రులు, బావమరిది అనురాగ్ సింఘాయా పారిపోతున్న వీడియో వైరల్ అయింది. అంతకుముందు మీడియాను ఆ కుటుంబం బెదిరించింది.

Read Also: One Nation One Election: ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…

తప్పుడు కేసులో ఇరికించి వేధించారని, 24 పేజీల సూసైడ్ లేఖ రాసి, గంట పాటు వీడియో రికార్డ్ చేసి తన బాధల్ని వ్యక్తపరిచాడు. ఈ వీడియో అందరితో కంట తడి పెట్టిస్తోంది. ఆయనకు న్యాయం చేయాలని సోషల్ మీడియా వ్యాప్తంగా ‘‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’’ అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అతని భార్య నికితా సింఘానియాను ఉద్యోగం నుంచి తొలగించాలని యాక్సెంచర్ కంపెనీకి వేల సంఖ్యలో రిక్వెస్టులు వస్తున్నాయి. వరకట్న వేధింపుల చట్టం, సెక్షన్ 498ఏ దుర్వినియోగం చేసే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలని లాయర్లు కోరుతున్నారు. ఈ కేసు నేపథ్యంలో భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలక మార్గదర్శకాలను సూచించింది.

Show comments