Site icon NTV Telugu

Global Livability Index 2022: నివాస యోగ్యత సూచీలో పడిపోయిన బెంగళూరు

Bengaluru

Bengaluru

ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా.. ఐటీ సిటీగా బెంగళూరు మెరుగైన స్థానంలో ఉండేది. గతేడాది కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో బెంగళూరు అగ్రస్థానంలో ఉన్న బెంగళూరు.. జూన్ 24న విడుదల చేసిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ‘గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2022’లో కర్ణాటక రాజధాని నగరం భారతీయ నగరాల్లో అత్యంత దిగువ స్థానంలో ఉంది. ఇటీవల కాలంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, దెబ్బతిన్న రోడ్లతో బెంగళూరు గుర్తింపు మసకబారుతోంది. మొదటి సారి, మొత్తం ఐదు భారతీయ నగరాలు జాబితాలో ఉన్నాయి; 2022కి ముందు ఢిల్లీ , ముంబై మాత్రమే ప్రదర్శించబడ్డాయి. ప్రస్తుత ఎడిషన్ కోసం అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలకు కూడా ఇండెక్స్‌లో స్థానం దక్కింది.

భారతదేశంలో ఐదింటికి ఈ జాబితాలో చోటు ఇవ్వగా.. ఇవన్నీ కూడా తక్కువ స్కోరుతో 140 నుంచి 146 మధ్యలో ఉన్నాయి. బెంగళూరు 54.4 స్కోరుతో 146వ స్థానంలో.. ఢిల్లీలో 56.5 స్కోరుతో 140వ స్థానంలో, ముంబై 56.2 స్కోరుతో 141వ స్థానంలో ఉన్నాయి. చెన్నై 55.8 స్కోరుతో 142, అహ్మదాబాద్ 55.7 స్కోరుతో 143వ ర్యాంకులు దక్కించుకున్నాయి.

PM Modi: దివ్యాంగ బాలుడి మాటలు విని ముచ్చటపడిన ప్రధాని మోదీ 

గతేడాది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ఐదు భారత మెట్రోల్లో మౌలిక సదుపాయాల పరంగా బెంగళూరుకు వచ్చిన స్కోరు 46.4 మాత్రమే. మౌలిక సదుపాయాల కొరతను ఇది సూచిస్తోంది. నాణ్యమైన రోడ్లు, ప్రజా రవాణా, అంతర్జాతీయ అనుసంధానత, టెలికాం, నీటి సదుపాయాలు, నాణ్యమైన నివాసాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ ఈ స్కోరు కేటాయించింది.పాకిస్థాన్‌లోని అతిపెద్ద మహానగరమైన కరాచీ ఐదు తక్కువ నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా ఉంది, అయితే మౌలిక సదుపాయాలలో బెంగళూరు కంటే మెరుగ్గా 51.8 స్కోరు సాధించింది. నైజీరియాలోని లాగోస్ ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం, మూడవ అతి తక్కువ నివాసయోగ్యమైన నగరంగా ర్యాంక్ పొందింది, అయితే మౌలిక సదుపాయాల విషయంలో బెంగళూరు కంటే ఎక్కువ స్కోర్ చేసింది

ఈఐయూ దాని వార్షిక నివాసయోగ్యత సూచిక కోసం క్రింది ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది: స్థిరత్వం (25%), సంస్కృతి, పర్యావరణం (25%), ఆరోగ్య సంరక్షణ (20%), మౌలిక సదుపాయాలు (20%), విద్య (10%). ఈ సూచిక కోసం మొత్తం 173 నగరాలను విశ్లేషించారు. ఈ సంవత్సరం జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానంలో ఉండగా, సిరియా రాజధాని డమాస్కస్ అతి తక్కువ నివాసయోగ్యమైనది.

Exit mobile version