NTV Telugu Site icon

Darshan Case: దర్శన్‌కి బెయిల్.. సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న బెంగళూర్ పోలీసులు..

Darshan

Darshan

Darshan Case: కన్నడ స్టార్ నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం ఎదురైంది. అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో దాదాపుగా 4 నెలల పాటు జైలులో ఉన్న దర్శన్‌కి ఇటీవల ఆరోగ్య కారణాలతో కర్నాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజైరు చేసింది. వెన్నెముకకు శస్త్రచికిత్స కోసం దర్శన్‌కి బెయిల్ ఇచ్చింది. అతడిని బళ్లారి జైలు నుంచి విడుదల చేశారు. అయితే, ఈ మధ్యంతర బెయిల్‌ని సవాల్ చేస్తూ త్వరలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు బెంగళూర్ పోలీస్ కమిషనర్ బి దయానంద మంగళవారం వెల్లడించారు.

47 ఏళ్ల దర్శన్‌కి అక్టోబర్ 30న కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 13న ఆ రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దర్శన్ కేసులో పోలీసులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయాలనుకుంటు, వారు ముందుకు వెళ్లవచ్చని హోం శాఖ కార్యదర్శకి తాను చెప్పినట్లు తెలిపారు.

Read Also: Asian Champions Trophy-2024: వారెవ్వా.. జపాన్‌ను ఓడించి ఫైనల్‌‌కు దూసుకెళ్లిన భారత్

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడతో సహా 15 మందిని జూన్ 11న అరెస్ట్ చేశారు. 33 ఏళ్ల రేణుకాస్వామిని తన స్నేహితురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిస్తున్నారనే కోపంతో ఆయనను హత్య చేశారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన, బెంగళూర్ తీసుకువచ్చి దారుణంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు.

జూన్09న సుమనహళ్లిలోని ఓ కాలువ సమీపంలో స్వామి మృతదేహాన్ని కనుగొన్నారు. చిత్రదుర్గకు చెందిన దర్శన్ అభిమాన సంఘం సభ్యుడు రాఘవేంద్ర, దర్శన్‌ని కలిపిస్తానని మభ్యపెట్టి పథకం ప్రకారం హత్య చేశారు. పోస్టుమార్టం నివేదికలో తీవ్రగాయాలు, రక్తస్రావంతో మరణించినట్లు నిర్ధారణ అయింది. ఈ హత్యకు పవిత్ర గౌడ ప్రధాన కారణమని, ఆమె నేరం చేయడానిని దర్శన్‌తో పాటు ఇతరులను ప్రేరేపించి, కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.