Site icon NTV Telugu

Bengaluru Idgah Maidan Case: ఈద్గాలో గణేష్ చతుర్థి వేడుకలు.. త్రి సభ్య ధర్మాసనం విచారణ

Bengaluru Edgah Case

Bengaluru Edgah Case

Bengaluru Idgah Maidan Case- Supreme Court: బెంగళూరులోని ఈద్గా మైదాన్‌లో గణేష్ చతుర్థి వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడం వివాదానికి దారి తీసింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ఈ కేసులు ప్రస్తుతం సుప్రీం కోర్టుకు చేరింది. అంతకుముందు రోజు ఈ కేసులు విచారించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో న్యాయమూర్తులు పరస్పరం విభేదించారు. దీంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం వినాయక చతుర్థి పండగ ప్రారంభం అవుతుండటంతో మంగళవారం సాయంత్రంలోపే ఈ వివాదానికి స్వస్తి పలకాలని సుప్రీంకోర్టు భావిస్తోంది.

ఈ కేసును విచారించిన హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియా మధ్య భేదాభిప్రాయాలు రావడంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఏఎస్ ఓకా, ఎంఎం సుందరేష్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1954 చట్టం ప్రకారం ఈద్గా ప్రాంతం వక్ఫ్ బోర్డు ఆస్తిగా పరిగణించబడుతోందిని.. ఉన్నట్టుండి దీన్ని వివాదాస్పద భూమి అని.. ఇక్కడే గణేష్ చతుర్థిని నిర్వహించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ ప్రదేశంలో ఇప్పటి వరకు ఇతర మతాలకు సంబంధించి ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను నిర్వహించలేదని బోర్డు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

Read Also: NCRB Report: ఎక్కువ అత్యాచారాలు ఆ రాష్ట్రాల్లోనే.. ఎన్సీఆర్బీ నివేదికలో కీలక విషయాలు

ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం – న్యాయమూర్తులు హేమంత్ గుప్తా మరియు సుధాన్షు ధులియా – అభిప్రాయ భేదాలను పేర్కొంటూ సమస్యను ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. న్యాయమూర్తులు ఇందిరా బెనర్జీ, ఏఎస్ ఓకా, ఎంఎం సుందరేష్ అనే త్రిసభ్య ధర్మాసనం ముందు సీజేఐ యూయూ లలిత్ దానిని లిస్ట్ చేశారు. వచ్చే ఏడాదిలో బెంగళూర్ నగరపాలక సంస్థకు ‘బృహత్ బెంగళూరు మహానగర పాలికే’కు ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయ ఉద్దేశ్యాల్లోనే ఈ ప్రాంతాన్ని వివాదాస్పదం చేస్తున్నారనే ఆరోపణలు చేసింది వక్ఫ్ బోర్డు.

Exit mobile version