పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఒక మహిళా వైద్యురాలు సంస్కారం మరిచి విమానంలో హద్దులు దాటి ప్రవర్తించింది. విమాన సిబ్బంది వారించినా పట్టించుకోకుండా ఒక డాన్‌లో ప్రవర్తించింది. అంతటితో ఆగకుండా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని క్రాష్ చేస్తానంటూ బెదిరించింది. దీంతో విమాన సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు.. బెంగళూరు వైద్యురాలు వ్యాస్ హిరల్ మోహన్‌భాయ్‌ను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!
మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సూరత్ అంతర్జాతీయ విమానాశ్రయానికి IX2749 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బయల్దేరడానికి సిద్ధపడుతోంది. అదే విమానంలో 36 ఏళ్ల బెంగళూరు వైద్యురాలు మోహన్‌భాయ్ ఎక్కింది. సామాన్లు మొదటి వరుసలో వదిలి.. సీటు నెంబర్ 20ఎఫ్‌ను ఆక్రమించుకుంది. దీనికి విమాన సిబ్బంది అభ్యంతరం చెప్పారు. సామాన్లు సీటు దగ్గర ఉన్న ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచమని కోరారు. అందుకు వైద్యురాలు నిరాకరించింది. సిబ్బందిపై గట్టి గట్టిగా అరిచింది. తోటి ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురి చేసింది. పైలట్ వారించినా లెక్కచేయలేదు. అంతటితో ఆగకుండా విమానాన్ని పేల్చేస్తానంటూ బెదిరింపులకు దిగింది.
ఇది కూడా చదవండి: CBI: ఇంటర్‌పోల్ సహకారంతో నకిలీ కరెన్సీ నోట్ల కేసు నిందితుడుని దేశానికి రప్పించిన సీబీఐ..!
వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది, పైలట్.. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది ఆమెను విమానం నుంచి దించేశారు. మహిళ యొక్క వింత ప్రవర్తనతో తోటి ప్రయాణికులకు ముప్పు పొంచి ఉంటుందని భావించి దించేసినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి. వైద్యురాలిది బెంగళూరులోని యలహంక సమీపంలోని శివనహళ్లి ప్రాంత వాసి.
వైద్యురాలిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 351 (4) (అజ్ఞాత కమ్యూనికేషన్ ద్వారా నేరపూరిత బెదిరింపు) మరియు 353 (1) (బి) (ప్రజా దుష్ప్రవర్తన ప్రకటనలు) అలాగే పౌర విమానయాన భద్రతకు వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన చట్టాల అణచివేత చట్టంలోని సెక్షన్ 3(1) (ఎ) (విమానంలో విమానంలో ఉన్న వ్యక్తిపై హింసాత్మక చర్య) కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.