NTV Telugu Site icon

Bengaluru: బెంగళూర్‌లో భారీ వర్షం.. చెన్నైకి విమానాల మళ్లింపు..

Bengaluru

Bengaluru

Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో బెంగళూర్ వెళ్లాల్సిన కనీసం 10 విమానాలను చెన్నైకి మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. బెంగళూర్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన సేవలపై ప్రభావం చూపిస్తున్నాయని ఇండిగో ఎక్స్‌లో పేర్కొంది. తమ బృందాలు వాతావరణాన్ని గమనిస్తున్నాయని, పరిస్థితులు మెరుగైన తర్వాత సకాలంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది.

Read Also: AP New DGP: కొత్త డీజీపీ ఎంపికపై కసరత్తు.. కేంద్రానికి ఐదుగురి పేర్లు పంపిన ఏపీ

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బెంగళూరులో విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని, ఫలితంగా విమాన ట్రాఫిక్ రద్దీ ఏర్పడిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు ఫ్లైట్ స్టేటస్ కనుక్కోవాలని సూచించింది. బెంగళూర్‌లో భారీ వర్షాలకు కొన్ని రోడ్లు జలమయం అయ్యాయని, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినట్లు ప్రజలు సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు కూడా విమానశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ గురించి అప్రమత్తం చేశారు.