Site icon NTV Telugu

Viral Video: బస్సులో చెప్పులతో కొట్టుకున్న మహిళలు.. విండో కోసం గొడవ..

Bengaluru

Bengaluru

Viral Video: ఇటీవల కాలంలో బస్సుల్లో మహిళలు కొట్టుకోవడం చూస్తున్నాం. చిన్నచిన్న విషయాలకు పక్కకు జనాలు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయి కొట్టేసుకుంటున్నారు. వీటికి సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా బెంగళూర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ప్రభుత్వ బస్సులో ఇద్దరు మహిళలు దారుణంగా కొట్లాడారు. ఏకంగా బూట్లతో ఒకరినొకరు కొట్టుకున్నారు.

Read Also: Uttarakhand: అక్రమ మదర్సా కూల్చివేతతో అల్లర్లు.. “షూట్-ఎట్-సైట్” ఆర్డర్స్ జారీ..

ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో అస్పష్టంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళలు గొడవ పడుతుంటే, మిగతా ప్రయాణికులు ప్రేక్షక పాత్ర వహించి గొడవను చూసేందుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. బస్సులో విండో కోసం గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరి మధ్య చిన్నగా ప్రారంభమైన గొడవ, చివరకు చెప్పులు తీసుకొని కొట్టుకునే స్థాయికి చేరింది. చివరకు బస్ కండక్టర్ కలుగజేసుకుని ఇద్దరినీ విడదీయడం వీడియోలో చూడొచ్చు.

దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘మహిళలు తాము పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులో ఉన్నామని మరిచిపోయారని, ఇతరులకు భంగం కలిగించారని, అనుచితంగా ప్రవర్తించారని, ఇది వారికి అవమానకరం’’ అని ఒక వ్యక్తి ఎక్స్(ట్విట్టర్)లో కామెంట్ చేశారు. ‘‘WWEని BMTC బస్సుల్లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తెలియదు’’ అని, మరొకరు ‘‘ ఒకప్పుడు బీఎంటీసీ బస్సులో ప్రయాణం ప్రశాంతంగా ఉండేది, ఇప్పుడు విండో జరిపితే ఒకరినొకరు చప్పులతో కొట్టుకుంటున్నారు’’ అని ట్వీట్ చేశారు.

Exit mobile version