Kolkata: డాక్టర్ల సామూహిక రాజీనామాలు తిరస్కరణ.. వ్యక్తిగతంగా సమర్పించాలన్న ప్రభుత్వం
- డాక్టర్ల సామూహిక రాజీనామాలు తిరస్కరణ
- వ్యక్తిగతంగా సమర్పించాలన్న బెంగాల్ ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగించారు. అనంతరం వారితో ప్రభుత్వం చర్చలు కూడా జరిపింది. అయితే తమ భద్రత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా సామూహిక రాజీనామాలు చేశారు. ఒక్కో రోజు కొంత మంది రాజీనామాలు సమర్పించారు.
ఇది కూడా చదవండి: Usha Sri Charan: విజయదశమి రోజు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం: మాజీ మంత్రి
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
తాజాగా ఆ రాజీనామాలను బెంగాల్ ప్రభుత్వం తిరస్కరించింది. సామూహిక రాజీనామాలు చట్టబద్ధంగా చెల్లుబాటు కావని తెలిపింది. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేసే వైద్యులు సామూహిక రాజీనామా చెల్లుబాటుకాదని.. సేవా నిబంధనల ప్రకారం వ్యక్తిగతంగా సమర్పించాలని శనివారం ప్రభుత్వం తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైద్య కళాశాలలు మరియు ఆసుపత్రుల నుంచి సీనియర్ వైద్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కాలేజ్ ఆఫ్ మెడిసిన్, సాగూర్ దత్తా హాస్పిటల్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGMER) వైద్యుల రాజీనామా చేసి జూనియర్‌లకు మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఈ ఆసుపత్రుల వైద్యులు రాజీనామాలు సమర్పించారు. అయితే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బంద్యోపాధ్యాయ స్పందిస్తూ.. మూకుమ్మడి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించబోదని స్పష్టం చేశారు.
‘‘రాజీనామాలు రూల్ బుక్ ప్రకారం ఉద్యోగి మరియు యజమాని మధ్య వ్యక్తిగత విషయం. ఈ సామూహిక లేఖలకు చట్టపరమైన విలువ లేదు’’ అని బంద్యోపాధ్యాయ రాజీనామాలను తప్పు భావనగా తోసిపుచ్చారు. మాకు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి చెల్లాచెదురుగా లేఖలు అందాయని తెలిపారు.
ఆగస్టు 7న జూనియర్ వైద్యురాలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైంది. అప్పటి నుంచి జూనియర్ వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. బాధిత సహోద్యోగికి న్యాయం చేయాలని, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజీనామా చేయాలని, కార్యాలయంలో భద్రతను పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులలో జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!