NTV Telugu Site icon

Bengal doctor: హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో బెంగాల్ డాక్టర్ మృతి..

Bengal Doctor

Bengal Doctor

Bengal doctor: పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్‌లోని ఒక హోటల్ గదిలో ఒక డాక్టర్ అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గదిలోకి వెళ్లి చూడగా మృతదేహం కనిపించింది. మృతుడిని డాక్టర్ దీపా భట్టాచార్యగా గుర్తించారు. ఝర్‌గ్రామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సీనియర్ రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. మృతుడు ఐదవ అంతస్తులో నివసిస్తున్నాడు. హోటల్ సిబ్బంది ఉదయం అంతా అతడిని సంప్రదించేందుకు ప్రయత్నించింది, అయితే అనుమానం రావడంతో పోలీసులు విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Read Also: Wedding On Video Call: భారత్‌లో వధువు.. టర్కీలో వరుడు.. బాస్ లీవ్ ఇవ్వకపోవడంతో వీడియో కాల్‌లో పెళ్లి

హోటల్ గదిలో డాక్టర్ భట్టాచార్య మంచంపై పడి ఉన్నట్లు గుర్తించారు. సమీపంలో ఒక సిరంజి, సూసైడ్ నోట్‌ కనుగొన్నట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. పోలీసులు దీనిని అసహజ మరణంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఝార్‌గ్రామ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అనురూప్ పఖిరా మాట్లాడుతూ.. అతను మానసిక కుంగుబాటుతో మాట్లాడుతున్నాడని అతడి స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పారు. పోస్టుమార్టం తర్వాతే మృతికి అసలు కారణం తెస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Show comments