Hepatitis-C: హైపటైటిస్-సితో బీకేర్‌పుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hepatitis-C: కాలేయ వ్యాధికి కారణమవుతున్న హైపటైటిస్-సితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. క్రమంగా హైపటైటిస్-సీ క్రమంగా వ్యాపిస్తోందని.. జాగ్రత్తగా లేకుంటే ఇది తీవ్రమైన వ్యాధిగా విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 235 మందిలో ఒకరికి హైపటైటిస్-సీ ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో 2022-23లో 1.64 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయగా వారిలో 710 మందికి హైపటైటిస్-సీ ఉన్నట్లుగా గుర్తించినట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. ఇది ఇన్‌ఫెక్షన్ ఉన్న రక్తం ద్వారా ప్రధానంగా వ్యాపిస్తుంది. సరైన స్క్రీనింగ్ చేయకుండా రక్త మార్పిడి చేయడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని.. ఇలా చేయడం ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. సురక్షితమైన ఇంజక్షన్ విధానాలు లేకపోవడం, ఇతరులు ఉపయోగించిన వస్తువులు వాడటం ద్వారా కూడా వ్యాపించేందుకు అవకాశం ఉంది.
Read also: Vinayaka Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే త్వరలోనే వివాహం జరుగుతుంది
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
మద్యం అలవాటు, ఊబకాయం ఈ వ్యాధి తీవ్రతను పెంచుతాయి. వ్యాధి తీవ్రమైన తరువాత జ్వరం, అలసట, రుచి కోల్పోవడం, కామెర్ల లక్షణాలు, కీళ్లనొప్పులు, ఆందోళన, ఆకలి మందగించడం, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యం చేయించుకోకపోతే సమస్య ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే తొలిదశలో లక్షణాలు అతం త్వరగా బయటపడవని.. కానీ రక్తమార్పిడి వంటి సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవడం, తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వంటివి చేయాలని వైద్య చెబుతున్నారు. లివర్ సిరోసిస్ ద్వారా అత్యధిక మరణాలు మనదేశంలోనే సంభవించినట్లు ఐసీఎంఆర్ నివేదికలో వెల్లడించింది. కాలేయం పూర్తిగా దెబ్బతినడానికి ముందు స్టేజిని లివర్ సిరోసిస్‌గా చూడాలని వైద్యులు పేర్కొంటున్నారు. 2017వ సంవత్సరంలో సుమారుగా 2,20,000 మంది లివర్ సిరోసిస్, కాలేయ వ్యాధులతో మృతి చెందినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. హెపటైటిస్-సీని నిర్లక్ష్యం చేస్తే లివర్ సిరోసిస్‌తోపాటు కాలేయం జబ్బులు తీవ్ర స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు దేశవ్యాప్తంగా 5.82 కోట్ల మందికి స్క్రీనింగ్ చేయగా 1.74 లక్షల మంది తీవ్రమైన హెపటైటిస్- బి, హెపటైటిస్-సీ వల్ల బాధపడుతున్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ‘బి’ బాధితుల కంటే ‘సీ’ బాధితులే ఎక్కువగా ఉన్నారు. హైపటైటిస్ కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నవారిలో ‘బి’ బాధితులు 0.05 శాతం మంది ఉండగా.. ‘సి’ రోగులు 0.4 శాతం మంది ఉన్నట్లు నివేదికలో వెల్లడయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు హైపటైటిస్-సీతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
- Tags
- BeCare
- central
- Hepatitis-C
- people
- Survey
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!