Site icon NTV Telugu

India Bangladesh: ‘‘భారత భూభాగాలను కలుపుకుంటాం’’.. బంగ్లాదేశ్ నేత వ్యాఖ్యలపై భారత్ ఫైర్..

India Bangladesh

India Bangladesh

India Bangladesh: బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం విర్రవీగుతోంది. భారత్‌ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్న మిగతా నేతలు భారత్‌‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ సలహాదారుగా ఉన్న మహ్ఫజ్ ఆలం ఫేస్‌బుక్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విజయ్ దినోత్సవం రోజున ఆలం ఈ పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా, భారత్‌లోని పలు ప్రాంతాలను బంగ్లాదేశ్‌లో విలీనం చేసుకుంటామని బెదిరిస్తూ కామెంట్స్ చేశాడు.

అయితే, ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ‘‘మేము బంగ్లాదేశ్ వైపు ఈ సమస్యపై మా తీవ్ర నిరసనను వ్యక్తం చేసాము. సూచించబడిన పోస్ట్ తీసివేయబడినట్లు మేము అర్థం చేసుకున్నాము’’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MEA) ప్రతినిధి రంధి జైస్వాల్ తెలిపారు. పబ్లిక్ కామెంట్స్ చేసే ముందు అన్ని పరిణామాలను దృష్టిలో ఉంచుకోవాలని బంగ్లాదేశ్‌కి సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే సమయంలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది.

Read Also: Kerala High Court: ఆస్పత్రులు ‘‘ఆధునిక సమాజంలో దేవాలయాలు’’.. దాడులు చేస్తే సహించొద్దు..

1971 లిబరేషన్ వార్‌లో పాకిస్తాన్ సైన్యంపై సాధించిన విజయానికి గుర్తుగా బంగ్లాదేశ్ డిసెంబర్ 16న ‘‘విక్టరీడే’’ రోజున ఆలం ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌ని కట్టడి చేసే లక్ష్యంతో భారత రాజకీయాలు ఉన్నాయని ఆలం ఆరోపించారు. బంగ్లాదేశ్ నిజమైన స్వాతంత్య్రం, విముక్తి సాధించాలంటే అది ప్రస్తుతం పరిమితుల నుంచి విముక్తి పొందాలని, దాని భూభాగాన్ని విస్తరించాలని, ఇది తమ ప్రయత్నాలకు నాంది మాత్రమే అని ఆలం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపురలను బంగ్లాదేశ్‌లో భాగమని ఆయన అభివర్ణించారు. అయితే ఆ తర్వాత ఆ పోస్ట్‌ను తొలగించాడు.

ఆగస్టు నెలలో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఈ కుట్రలో ఆలం కీలకంగా వ్యవహరించాడు. సెప్టెంబర్‌లో న్యూయార్క్‌లో జరిగి క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటివ్ ఈవెంట్‌లో బంగ్లాదేశ్ ‌లో షేక్ హసీనాను బహిష్కరించడానికి దారి తీసిన నినసనల వెనక సూత్రధారిగా మహ్ఫూక్ ఆలంను యూనస్ పరిచయం చేశాడు.

Exit mobile version