Plane Crash: అజిత్ పవార్ చనిపోయిన అదే చోట.. కుప్పకూలిన మరో విమానం..

  • బారామతిలో కుప్పకూలిని మరో విమానం..
  • అజిత్ పవార్ చనిపోయిన అదే చోట ప్రమాదం..
  • దెబ్బతిన్న విమానం, పైలట్ సురక్షితం..
Plane Crash

Plane Crash

Plane Crash: మహారాష్ట్ర బారామతి ఎయిర్ ఫీల్డ్‌లో మరో విమానం కుప్పకూలింది. ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన ట్రైనింగ్ విమానం రన్‌వే దాటి వెళ్లింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం జరిగిన 7 నెలల తర్వాత మరో ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో విమానం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు శిక్షణా కార్యక్రమంలో భాగంగా విమానం రన్‌వేను దాటి వెళ్లింది. విమానాన్ని రన్‌వేపై పూర్తిగా ఆపలేకపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అది రన్‌వే 29 చివరి భాగాన్ని దాటి ముందుకు వెళ్లింది. ఈ ఘటనకు ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. విమానంలో సాంకేతిక లోపమా, పైలట్ తప్పిదమా.? అనేది ఇంకా తెలియరాలేదు. 7 నెలల క్రితం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం రన్ వే క్రాష్ ల్యాండ్ అయింది. అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఇద్దరు పైలట్లు, ఓ ఫ్లైట్ అటెండెంట్ మృతి చెందారు.