NTV Telugu Site icon

Kerala: ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య కేసులో నిషేధిత పీఎఫ్ఐ వ్యక్తి అరెస్ట్..

Nia

Nia

Kerala: గతేడాది ఏప్రిల్‌లో కేరళకు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నాయకుడు శ్రీనివాసన్ హత్య జరిగింది. ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ దుమారాన్ని రేపింది. అధికార కమ్యూనిస్ట్ పార్టీపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ కేసులో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కీలక సభ్యుడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) శుక్రవారం అరెస్ట్ చేసింది.

ఈ నేరంలో కీలక నిందితుడైన షిహాబ్ అలియాస్ బాబు పరీరాలో ఉన్నాడని, కేరళలోని మనప్పురంలోని అతని నివాసం నుంచి అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్ 2022లో పాలక్కాడల్ శ్రీనివాసన్ హత్య జరిగింది. హత్యకు పీఎఫ్ఐ నిర్వహిస్తున్న టెర్రర్ ఎకోసిస్టమ్ లో షిహాబ్ భాగమని దర్యాప్తులో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింది.

Read Also: PM Modi: భారతీయుడు చంద్రునిపై దిగే రోజు ఎంతో దూరంలో లేదు..

పీఎఫ్ఐ నాయకులు పన్నిన కుట్రకు అనుగుణంగా షిహాబ్ ఈ హత్య చేశాడని, పీఎఫ్ఐ ఆదేశాల మేరకు కేసులో కీలకమైన ఆధారాలను ధ్వంసం చేయడానికి మహ్మద్ హకీమ్ నిందితుడికి ఆశ్రయం కల్పించినట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఏడాది మార్చి 17న ఈ కేసులో 59 మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 69 మంది కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తెలిపింది.