NTV Telugu Site icon

BAN vs IND: సార్క్ పునరుద్ధరణకు భారతదేశం మద్దతు కోరిన బంగ్లాదేశ్

Ban Vs Ind

Ban Vs Ind

BAN vs IND: ఒమన్‌లోని మస్కట్‌లో జరిగిన 8వ హిందూ మహాసముద్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్- పాకిస్తాన్ మధ్య వివాదంతో చాలా కాలంగా సార్క్ పునరుద్ధరణపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) పునరుద్ధరణకు భారత్ మద్దతును కోరారు. అలాగే, సార్క్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని హుస్సేన్ నొక్కి చెప్పారు.

Read Also: Medak: దారుణం.. ప్రియురాలని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు

ఇక, ఈ సమావేశం తర్వాత ఎక్స్ (ట్విట్టర్)లో కేంద్రమంత్రి జైశంకర్ చేసిన పోస్టులో సార్క్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన విదేశాంగ సలహాదారుడు ఎండీ తౌహిద్ హుస్సేన్‌ను కలిశాను.. ఇరువురి మధ్య ద్వైపాక్షిక సంబంధంపై, BIMSTECపై కూడా దృష్టి సారించింది అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల పరంగా రెండు పొరుగు దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించాయి.. వాటిని పరిష్కరించడానికి కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా చర్చించాయని విదేశాంగ మంత్రి జైశంక్ ప్రకటించారు.

Read Also: GHMC: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. 17 నామినేషన్లు దాఖలు

కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 2 నుంచి 4 వరకు బ్యాంకాక్‌లో జరగనున్న 6వ BIMSTEC శిఖరాగ్ర సమావేశం తర్వాత థాయిలాండ్ స్థానంలో బంగ్లాదేశ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కలిసిన తర్వాత ఇద్దరు (భారత్- బంగ్లా) విదేశాంగ మంత్రుల మధ్య ఇది ​​రెండవ సమావేశం.. ఇక, మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో పదవీకి రాజీనామా చేసిన తర్వాత ఆమె భారతదేశానికి వలస వచ్చింది.