Site icon NTV Telugu

Bangladesh: NSA అజిత్ దోవల్‌కు బంగ్లాదేశ్ ఆహ్వానం..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ జాతీయ భద్రతా సలహాదారు (NSA) ఖలీలూర్ రెహమాన్ ఈరోజు న్యూఢిల్లీలో భారత NSA అజిత్ దోవల్‌ను కలిశారు. షేక్ హసీనాను అప్పగింత వ్యవహారంపై ఇప్పటికే భారత్, బంగ్లాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. రెండు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారిన ఈ సమయంలో అజిత్ దోవల్ ఢాకాలో పర్యటించాల్సిందిగా రెహమాన్ ఆహ్వానించారు. కొలంబో భద్రతా కాన్‌క్లేవ్ యొక్క 7వ NSA సమావేశంలో ఇద్దరు నాయకులు సమావేశమయ్యారు.

Read Also: World Cup 2026 Schedule: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. వేర్వేరు గ్రూప్‌ల్లో భారత్, పాకిస్థాన్!

గతేడాది హింసాత్మక అల్లర్ల తర్వాత షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయి వచ్చింది. అప్పటి నుంచి ఆమె ఇండియాలోనే ఉంది. ఇటీవల, ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన నేరాలకు పాల్పడిందనే అభియోగం కింద దోషిగా తేలింది. ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు మరణశిక్ష విధించింది. భారత్‌లో ఉన్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్ కోరుతోంది. భారత్ ఈ అభ్యర్థనను పెండింగ్‌లో ఉంచింది.

భద్రతకు సంబంధించిన కీలకమైన విషయాలపై సభ్య దేశాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడానికి, హిందూ మహాసముద్ర ప్రాంతంలో ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి కొలంబో భద్రతా సమావేశం ఏర్పడింది. వీటిలో సముద్ర భద్రత మరియు భద్రత, ఉగ్రవాదం మరియు రాడికలైజేషన్‌ను ఎదుర్కోవడం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడం, సైబర్ భద్రత, క్లిష్టమైన మౌలిక సదుపాయాల రక్షణ, మానవతా సాయం వంటి వాటిపై చర్చిస్తారు.

Exit mobile version