Delhi: బంగ్లాదేశ్‌లో హిందూ ఎస్ఐ హత్య కేసు.. ఢిల్లీలో నిందితుడి అరెస్ట్..

  • బంగ్లాదేశ్‌లో హిందూ ఎస్‌ఐ హత్య కేసు..
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో నిందితుడి అరెస్ట్..
  • బంగ్లాకు బహిష్కరణ..
Bangladesh

Bangladesh

Delhi: బంగ్లాదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, హిందూ పోలీస్ అధికారిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. ఇతను యూరప్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అహ్మద్ రజా హసన్ మెహదీగా గుర్తించారు. ఇతడిని బంగ్లాదేశ్‌కు బహిష్కరించారు. బంగ్లాదేశ్ లోని హబీగంజ్ నివాసి అయిన మోహదీ, ఆగస్టు 5, 2024న ఎస్‌ఐ సంతోష్ చౌదరి హత్య చేశాడు. షేక్ హసీనాను గద్దె దించాలని ఉద్యమం చేసిన సమయంలో ఈ హత్య జరిగింది.

Read Also: God vs Job Deal: దేవుడితో 20 లక్షల ప్యాకేజీ ఒప్పందం.. హుండీలో విద్యార్థి లేఖ వైరల్..

పోలీస్ స్టేషన్‌లో దాడికి గురైన సంతోష్ మరణించారు. అతడి మృతదేహాన్ని చెట్టుకు వెలాడదీశారు. ఆగస్టు 5, 2024లో షేక్ హసీనా హింసాత్మక ఉద్యమం తర్వాత, తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అదే రోజు బంగ్లా వ్యాప్తంగా మైనారిటీలైన హిందువులపై దాడులు జరిగాయి.

తన హత్యకు ఏడాది ముందే సంతోష్ వివాహం చేసుకున్నారు. హబీగంజ్‌లోని బినియాచాంగ్ పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగి, సంతోష్ హత్య తర్వాత మూడు నెలలకు ఆయన భార్య ఒక కుమారుడికి జన్మనిచ్చింది. పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగిన రోజు విద్యార్థులు , గ్రామస్తులు ఇతర చోట్ల మరణాలను నిరసిస్తూ ఒక మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ స్టేషన్ ముందుకు రాగానే పోలీసులు కాల్పులు జరిపారు. ఆరుగురు ఈ కాల్పుల్లో మరణించారు. కోపంతో ఉన్న గ్రామస్తులు స్టేషన్‌ను చుట్టుముట్టి నిప్పంటించారు. ఎస్ఐ సంతోష్ చౌదరిని దారుణంగా కొట్టి, సజీవ దహనం చేసి, చెట్టుకు వేలాడదీశారు.