NTV Telugu Site icon

India Bangladesh: భారత్‌పై బంగ్లాదేశ్ కుట్ర.. సరిహద్దుల్లో హై అలర్ట్..

India Bangladesh

India Bangladesh

India Bangladesh: షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్న మహ్మద్ యూనస్ భారత్‌తో మెరుగైన సంబంధాలు కోరుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన సర్కార్‌లోని విద్యార్థి నేతలు, జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీలకు చెందిన నేతలు మతోన్మాద వ్యాఖ్యలు చేస్తూ, అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. హిందువులు, భారత్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ తనకు చేసిన అన్యాయాలను మరిచిపోయి పాకిస్తాన్‌తో స్నేహం చేస్తోంది.

Read Also: Allahabad HC: అత్యాచార బాధితురాలు గర్భాన్ని వద్దనుకునే హక్కు ఉంది..

ఈ నేపథ్యంలోనే రెండు దేశాలు కలిపి భారత్‌పై ఏదో కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాక్ ఐఎస్ఐ అధికారులు బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన సమయంలో, భారత్ సరిహద్దుల్లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. తాజాగా జాగ్రన్ రిపోర్ట్ ప్రకారం, ఇటీవల ఏర్పడిన ‘‘బంగ్లాదేశ్ జనగన్’’ అనే సంస్థ, భారత్ సరిహద్దుల్లో అస్థిరతకు ప్లాన్ చేస్తోందని సమాచారం. సరిహద్దుల్లో వేలాది మంది చేరడం, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా సామూహికంగా ఆవుల్ని వధించడం, గొడ్డుమాంసం పంపిణీ కార్యక్రమాలను చేపడుతోంది. దీంతో మన కేంద్ర నిఘా సంస్థలు, బీఎస్ఎఫ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాయి. సరిహద్దుల్లో భద్రతని పెంచాయి.

మరోవైపు మహ్మద్ యూనస్ ఏప్రిల్ 2-4 తేదీల్లో థాయిలాండ్‌లో జరిగే 6వ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో సమావేశం జరుగుతుందని బంగ్లాదేశ్ ఆశ పడుతోంది. బిమ్‌స్టెక్ సదస్సు అవకాశంగా ఇద్దరు నేతలు కలిస అవకాశం ఉంది. అయితే,దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.