IT Jobs: టెకీల తొలగింపు.. బెంగళూరు టాప్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Jobs: సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ (టెకీల) తొలగింపులో బెంగళూరు టాప్ ప్లేస్‌లో ఉంది. ఐటీ ఉద్యోగాలు ఎక్కువ ఉన్న నగరంలోనే టెకీల తొలగింపు ఎక్కువగా ఉంది. ఇప్పటికే లేఆఫ్స్‌డౌన్ ట్రెండ్ కొనసాగుతుండగా… ఇదే పరిస్థితి తిరిగి కొన్ని కంపెనీల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే మరికొంత మంది టెకీలకు ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడనుంది. టెకీల తొలగింపు 2022తో పోల్చితే .. 2023 తొలి 6 నెలల్లో అధికంగా ఉన్నట్టు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ సర్వే నివేదికలో వెల్లడయింది.
Also Read
- BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
- Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
- BRICS 2026: మోదీ చేతుల్లో జిన్‌పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
లేఆఫ్స్ పెరుగుదలతో టెకీలకు మళ్లీ కష్టాలు మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా టెకీల ఉద్వాసన పర్వం ఉధృతమవుతోంది. అమెరికా, ఐరోపాతో పాటు పలు దేశాల్లో ద్రవ్యోల్బణం పెరగడంతో ఐటీ, ఇతర కంపెనీల లాభాలు తగ్గిపోయాయి. ఆర్థికరంగ ఒడిదొడుకుల కారణంగా స్టార్టప్‌లలో పెట్టుబడుల సంఖ్య కూడా క్రమంగా తగ్గు ముఖం పట్టిందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2,13,020 మంది టెకీలకు ఉద్వాసన (2023, జనవరి నుంచి జూన్) పలికినట్టు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెబ్‌సైట్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది మొత్తంలో 45,166 టెకీలు ఉద్యోగాలు కోల్పో గా.. ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో లేఆఫ్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉద్యోగులను తొలగించిన జాబితాలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాహు, మెటా, జూమ్ ఉన్నాయి.
Read also: Supreme Court: మణిపూర్ ఘటన.. కేంద్ర ప్రభుత్వం పై సుప్రీం సీరియస్
భారత్‌లో కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఇండియాలో ఈ ఏడాది జనవరి నుంచి జూన్ దాకా 10,774 మంది టెకీలను తొలగించినట్టు లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదిక వెల్లడించింది. 2022లో ఉద్వాసనకు గురైన టెకీ ఉద్యోగుల సంఖ్య 6,530 మంది కాగా.. ఈ ఏడాదితో పోల్చి చూసినప్పుడు తొలి ఆరునెలల్లో టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నవారే అధికంగా ఉద్యోగాలు కోల్పోయారు. కోవిడ్ విజృంభించిన 2020లోనూ భారత్‌లోని 12,932 మంది టెకీలు ఉద్యోగాలు కోల్పో యారు. 2021లో కొత్త స్టార్టప్‌లకు ఫండింగ్ పెరిగింది. దీంతో ఈ సంఖ్య 4,080కు తగ్గింది. టెకీల తొలగింపులో భారత్‌లో బెంగళూరు మహానగరం మొదటి వరుసలో ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే అక్కడ 6,967 మంది ఉద్యోగాలు కోల్పోయారు. స్టార్టప్ హబ్‌గా రూపొందుతున్న క్రమంలో ఈ ప్రభావం అధికంగా పడినట్టు నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో లేఆఫ్‌లు పెద్దగా లేకపోవడంతో లేఆఫ్స్.ఎఫ్‌వైఐ నివేదికలో టెకీ ఉద్యోగుల తొలగింపునకు సంబంధించిన గణాంక వివరాలు పొందుపరచలేదు. గత శీతాకాలం నుంచి ఇప్పటిదాకా 107 ఇండియన్ స్టార్టప్‌లలో 28,046 మంది ఉద్యోగులకు లే ఆఫ్ సెగ తాకినట్టు ఐఎన్‌సీ 42 తాజా నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంలో 22 భారత ఎడ్‌టెక్ స్టార్టప్‌లు 9,871 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయని.. 59 స్టార్టప్‌లు 9,271 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!