Site icon NTV Telugu

Garba Rules: “సరైన దుస్తులు, సిందూరం, ఆధార్”.. నవరాత్రి గర్బా కోసం బజరంగ్ దళ్ నియమాలు..

Garba

Garba

Garba Rules: ఉత్తరాదిన నవరాత్రుల్లో జరిగే ‘‘గర్బా’’ వేడుకల కోసం పలు హిందూ సంఘాలు నిమయాలను రూపొందించాయి. పలు సందర్భాల్లో గర్భాలోకి అన్యమతస్తులు ప్రవేశించడం, గర్బా డ్యాన్సు చేస్తున్న మహిళల్ని వెక్కిరించడం లేకుంటే మోసం చేయడం వంటి ఘటనలు జరిగాయి. అయితే, ఇలాంటివి జరగకుండా బజరంగ్ దళ్ కీలక నియమాలను పెట్టింది. రాజస్థాన్ లోని కోటా, భిల్వారా నగరాల్లో గర్బా ఉత్సవాలు ఎలా నిర్వహించాలో సైన్ బోర్డులు, పోస్టర్లు, హెచ్చరికలు జారీచేసింది. కోట నగరంలో పలు రోడ్లపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) భారీ హోర్డింగుల్ని ఏర్పాటు చేసింది.

Read Also: Lawrence Bishnoi: లారెన్స్ బిష్ణోయ్ ‘‘దేశద్రోహి’’.. గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారా సంచలన వ్యాఖ్యలు..

హిందువులు కాని వారు వేడులకు నిషేధించింది, అనుచితమైన, అశ్లీల పాటలను ఖచ్చితంగా ఉండొద్దని ప్రకటించింది. గర్బా వేదికల్లో ప్రవేశించేందుకు ఆధార్ కార్డులు అవసరమని, ప్రతీ ఒక్కరూ సిందూరం ధరించాలని చెప్పారు. మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు బజరంగ్ దళ్ బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ‘‘ ఈ రోజుల్లో నవరాత్రి ఒక డిస్కోగా మారింది. ప్రజలు గర్బా కార్యక్రమాలకు వెళ్తున్నారు. సిగరెట్లు తాగుతున్నారు. అశ్లీల సంగీతం ప్లే చేస్తున్నారు. ఇది దేవతలకు అంకిత చేయబడిన మతపరమైన ప్రదేశంగా కనిపించడం లేదు’’ అని బజరంగ్ దళ్ కోట సిటీ సమన్వయకర్త నరేష్ ప్రజాపత్ అన్నారు. హిందువులు కాని వారిని ఖచ్చితంగా అనుమతించేది లేదని చెప్పారు. సరైన నియమాలు పాటించాలని ఆయన సూచించారు.

Exit mobile version