NTV Telugu Site icon

Badruddin Ajmal: హిందువులపై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా..క్షమించండి..

Badruddin Ajmal

Badruddin Ajmal

Badruddin Ajmal Apologises For Remarks On Hindus: అస్సాంకు చెందిన ఏఐయూడీఎఫ్ రాజకీయ పార్టీ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడం దేశవ్యాప్తంగా పొలిటికల్ దుమారానికి దారి తీశాయి. అయితే ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు బద్రుద్దీన్. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశ్యం లేదని, హిందువులపై చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా అంటూ శనివారం ప్రకటించారు. సీనియర్ నాయకుడిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. నా వ్యాఖ్యలతో బాధపడుతున్న ప్రతీ ఒక్కరికీ నేను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా అని అన్నారు. మైనారిటీలకు ప్రభుత్వం న్యాయం చేయడం, వారి విద్య, ఉపాధి ఇవ్వాలని కోరుతున్నట్లు వెల్లడించారు. జనాభా నియంత్రణ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అజ్మల్ అన్నారు.

Read Also: Delhi Municipal Elections: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం.. 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

శుక్రవారం బద్రుద్దీన్ అజ్మల్ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందువులు చిన్న వయసులో పెళ్లి చేసుకునేందుకు ముస్లిం ఫార్ములాను పాటించాలని సూచించారు. ముస్లిం యువకులు 20-22 ఏళ్ల వయసులో అమ్మాయిలు 18 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటారని.. హిందువులు మాత్రం 40 ఏళ్ల వయసులో తల్లిదండ్రుల ఒత్తడితో పెళ్లి చేసుకుంటారని అన్నారు. హిందువులు పెళ్లికి ముందు రెండుమూడు అక్రమ సంబంధాలు కలిగి ఉంటారని వ్యాఖ్యానించాడు. పిల్లలు కనకుండా ఖర్చులను ఆదా చేసే పనిలో హిందువులు ఉంటారని అన్నారు. ముస్లింలు చిన్న వయసులు పెళ్లి చేసుకుని ఎంతమంది పిల్లల్ని కంటున్నారో చూడంటూ కామెంట్స్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. అస్సాం బీజేపీ ఎమ్మెల్యే డిగాంత కలిటా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బద్రుద్దీన్ బంగ్లాదేశ్ వెళ్లాలని సూచించారు. మేము అతడి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని.. ఇది శ్రీరాముడు, సీతాదేవీలు నడిచిన నేల అని.. ఇక్కడ బంగ్లాదేశీయులకు చోటు లేదని.. ముస్లిం నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన విమర్శించారు.