NTV Telugu Site icon

Zeeshan Siddique: ఎన్సీపీ గూటికి బాబా సిద్ధిఖీ తనయుడు జీషన్

Zeeshan

Zeeshan

Zeeshan Siddique: మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పవార్‌ వర్గం నేత బాబా సిద్ధిఖీ కుమారుడు జిశాన్‌ సిద్ధిఖీ కూడా ఎన్సీపీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ దక్కకపోవడంతో అజిత్‌ పవార్‌ వర్గంలో చేరినట్లుగా తెలుస్తుంది. ఎన్సీపీ తరపున బాంద్రా ఈస్ట్‌ నుంచి జీషన్‌ను బరిలోకి దింపుతున్నట్లుగా ఎన్సీపీ అజిత్ వర్గం వెల్లడించింది.

Read Also: Adilabad: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు.. క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర ఎంతంటే..

ఇక, గతంలో జీషన్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై వాండ్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి అతడికి టికెట్‌ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్‌ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, పార్టీలో చేరిన తర్వాత జీషన్‌ మాట్లాడుతూ.. నాకు, నా ఫ్యామిలికీ ఇది ఎంతో ముఖ్యమైన రోజు.. మేము కష్టంలో ఉన్నప్పుడు మావెంట ఉండి ధైర్యం చెప్పిన అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరేలకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు. ఇక, బాంద్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నా.. ఇక్కడి ప్రజల ప్రేమ, సపోర్టుతో మళ్లీ విజయం సాధిస్తాను అని నమ్ముతున్నాను అన్నారు.

Read Also: KA Trailer: ‘క’ ట్రైలర్‌ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్సీపీ పవార్‌ వర్గం అభ్యర్థుల రెండో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులోనూ బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్‌కు బాంద్రా స్థానం నుంచి టికెట్‌ కేటాయించినట్లుగా పేర్కొనింది. ఎన్సీపీ పార్టీ అధినేత అజిత్ పవార్‌ అతడి కుటుంబానికి కంచుకోట అయిన బారామతి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్‌ 20న ఒకే దఫాలో పోలింగ్‌ జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే, శివసేన, ఎన్సీపీ పార్టీల చీలిక తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతుంది.