Site icon NTV Telugu

Ayodhya Ram Temple: అయోధ్య రాముడికి ఒక నెలలోనే ఎన్ని కోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా..?

Ram Mandir

Ram Mandir

Ayodhya Ram Temple: హిందువుల శతాబ్ధాల కల అయోధ్యలో రామమందిర నిర్మాణం. జనవరి 22న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడులకు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా పలు రంగాలకు చెందిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట్లాది మంది భారతీయలు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో చూశారు. అయితే, రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి భక్తులు లక్షల్లో అయోధ్యకు వెళ్తున్నారు.

ఇదిలా ఉంటే నెల రోజుల వ్యవధిలోనే భక్తుల నుంచి ఏకంగా 25 కిలోల బంగారం, వెండి ఆభరణాలు కలిపి రూ. 25 కోట్ల విరాళాలు చెక్కులు, డ్రాఫ్ట్‌లు, ఆలయ కార్యాలయంలో జమ చేసిన నగదుతో పాటు హుండీల్లో జమ అయినట్లు ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. రామాలయం ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ.. రూ. 25 కోట్ల అందినట్లు వెల్లడించారు. అయితే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలో నేరుగా ఆన్‌లైన్ ద్వారా జరిగిన లావాదేవీల గురించి తెలియదని చెప్పారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

Read Also: Alexei Navalny: ‘‘గుండెపై ఒకే పంచ్’’.. పుతిన్ విమర్శకుడిని కేజీబీ పాత టెక్నిక్‌తో చంపారా..?

శ్రీరామ ఆలయంలో వినియోగించలేని వెండి, బంగారంతో చేసిన వస్తువులను రామ్ లల్లాకు విరాళంగా ఇస్తున్నారని, అయితే భక్తుల భక్తిని దృష్టిలో ఉంచుకుని రామమందిరం ట్రస్టు బంగారం-వెండి ఆభరణాలు, పాత్రలు, పాత్రలు స్వీకరిస్తోందని గుప్తా చెప్పారు. శ్రీరామ నవమి రోజు అయోధ్యకు 50 లక్షల మంది భక్తులు వస్తారని, ఆ సమయంలో విరాళాలు మరింత పెరుగుతాయని ట్రస్ట్ భావిస్తోంది. రామనవమి సందర్భంగా భారీ మొత్తంలో నగదు ప్రవాహాన్ని నియంత్రించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రామజన్మభూమిలో నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసిందని గుప్తా తెలిపారు. శ్రీరాముడికి ఇచ్చిన బహుమతిగి వచ్చిన బంగారం, వెండి ఆభరణాలను కరిగించి వాటి నిర్వహణను భారత ప్రభుత్వ మింట్‌కి అప్పగిస్తామని రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు.

Exit mobile version