Site icon NTV Telugu

Ayodhya: కెమెరా ఉన్న గ్లాసెస్‌తో రామమందిరంలోకి వ్యక్తి.. ఫోటో తీస్తున్న క్రమంలో అరెస్ట్..

Ayodhya

Ayodhya

Ayodhya: అయోధ్య రామమందిర దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానస్పదంగా ప్రవర్తించాడు. అతడు ధరించిన కళ్లద్దాల్లో కెమెరాను దాచి ఉంచాడు. ఈ గ్లాసెస్ ధరించి కాంప్లెక్స్‌ని వీడియో, ఫోటోలు తీయడానికి ప్రయత్నించాడు. ఆలయ ప్రాంగణంలో భద్రతా చర్యలను ఉల్లంఘించినందుకు సదరు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని గుజరాత్ వడోదరకు చెందిన జయకుమార్‌గా పోలీసులు గుర్తించారు.

Read Also: Earthquake: హిమాలయాల్లో ఏదో రోజు విధ్వంసమే.. భూకంపాలకు కారణమేంటి..?

అనుమానితుడు తన అద్దాల్లో దాచిన కెమెరాను కలిగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతను ఆలయం లోపల గర్భగుడిలో ఫోటోలు తీయడానికి కెమెరాను ఉపయోంచాలనుకున్నాడు. అయితే, రామ మందిర భద్రత, గోప్యతను కోసం అధికారులు ఆలయంలోనిక మొబైల్ ఫోన్లు, కెమెరాలను నిషేధించారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. జయకుమార్ ఎందుకు ఫోటోలు తీయాలనుకున్నాడనే విషయంపై విచారణ జరుగుతోంది. దీంట్లో ఏదైనా కుట్ర ఉందా.? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version