NTV Telugu Site icon

Laddu Controversy: అయోధ్య రామ మందిరం కీలక నిర్ణయం.. ఆ ప్రసాదాలపై నిషేధం..!

Ayodhya

Ayodhya

Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీ వివాదంతో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడంపై నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారు చేసిన ప్రసాదాలనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని నిర్ణయించారు. అలాగే, భక్తులకు కూడా ప్రసాదంగా అందిస్తామని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.

Read Also: Devara: దేవర రిజల్ట్.. కొరటాల శివ థాంక్స్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్

ఇక, దేశవ్యాప్తంగా విక్రయిస్తున్న నెయ్యి స్వచ్ఛతపై అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ అనుమానించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు, మఠాల్లో బయట సంస్థలు తయారు చేసిన ప్రసాదాలను పూర్తిగా నిషేధించాలని కోరారు. దేవుళ్లకు ప్రసాదం ఆలయ అర్చకుల పర్యవేక్షణలోనే తయారు చేసి సమర్పించాలని సూచించారు.

Read Also: Maharastra : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం కార్యాలయంపై దాడి.. పారిపోయిన నిందితురాలు

కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు వినియోగిస్తున్నారనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతుందని అయోధ్య రామ మందిర ప్రధాన పూజరి చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా భక్తులు, సాధుసన్యాసులు మండిపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. అదే విధంగా మార్కెట్లో అమ్ముతున్న నూనె, నెయ్యిల నాణ్యత ప్రమాణాలను కూడా తనిఖీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రామ మందిర పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ డిమాండ్ చేశారు.