Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!

Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir

Ram Mandir Donation Theft Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామ మందిరంలో కానుకల దొంగతనం కేసు కీలక మలుపు తీసుకుంది.. ఈ కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ఈ కొత్త సిట్‌ను ఈరోజు లేదా రేపటిలోగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ దర్యాప్తు బృందానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్.ను కొత్త సిట్ అధిపతిగా నియమించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలాగే దర్యాప్తును సమగ్రంగా నిర్వహించేందుకు ఆర్థిక, పరిపాలన శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులను కూడా ఈ బృందంలో సభ్యులుగా చేర్చే అవకాశముంది. రామ మందిర కానుకల దొంగతనం కేసుకు సంబంధించి నిజానిజాలను వెలికితీయడంతో పాటు దర్యాప్తును పారదర్శకంగా నిర్వహించడమే కొత్త సిట్ ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు. ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసిన తర్వాత సిట్ సభ్యుల వివరాలు, దర్యాప్తు విధానంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.