Site icon NTV Telugu

Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కోడలు అవివా బేగ్ ప్రత్యక్షం.. వీడియో వైరల్

Priyanka Gandhi

Priyanka Gandhi

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. కుమారుడు రైహాన్ వాద్రా ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా.. రైహాన్ వాద్రా-అవివా బేగ్‌కు నిశ్చితార్థం జరిగిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా అవివా బేగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది వయనాడ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలో కాబోయే కోడలు అవివా బేగ్ ప్రత్యక్షమయ్యారు. రైహాన్ వాద్రాతో కలిసి ర్యాలీలో పాల్గొంది. రైహాన్ వాద్రా పక్కన నిలబడిన అవివా బేగ్ చాలా ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉన్నట్లు కనిపించింది. నవ్వుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీలో నివసించే అవివా బేగ్ మీడియా, డిజైన్, ఫొటోగ్రఫీలో నైపుణ్యం ఉంది. రైహాన్ వాద్రాకు అదే ఇష్టం. దీంతో ఇద్దరి ఇష్టాలు ఒకటి కావడంతో 7 ఏళ్ల నుంచి స్నేహం చేస్తున్నారు. ఇటీవల రైహాన్ వాద్రా.. పెళ్లి ప్రపోజ్ చేయగానే వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు అవివా బేగ్ తల్లి నందితా బేగ్-ప్రియాంకాగాంధీ కూడా చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహితురాళ్లుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్‌ను నిందితా బేగ్‌నే చేసినట్లుగా సమాచారం. ఇలా రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అదే రైహాన్ వాద్రా-అవివా బేగ్ బంధానికి పునాదులు పడినట్లుగా తెలుస్తోంది.

రైహాన్ వాద్రా…
రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు (Visual Artist), వైల్డ్‌లైఫ్‌, స్ట్రీట్‌, కమర్షియల్‌ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులోనే కెమెరా చేతపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతగానో ప్రోత్సహించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్‌ హౌస్‌లో ‘డార్క్‌ పర్సెప్షన్‌’ పేరుతో తొలి ఎగ్జిబిషన్‌ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్‌, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. ఇక 2017లో పాఠశాల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రైహాన్ వాద్రా కంటికి గాయమైంది.

Exit mobile version