NTV Telugu Site icon

Eknath Shinde: ఆటోరిక్షా మెర్సిడెజ్‌ను వెనక్కి నెట్టేసింది.. ఏక్‌నాథ్ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు

Eknath Shinde

Eknath Shinde

ఉద్ధవ్ ఠాక్రేపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విమర్శల వర్షం కురిపించారు. ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు నేతలకు నాయకత్వం వహిస్తున్నపుడు కొంత మంది సేన నాయకులు ఆటోరిక్షా డ్రైవర్ అని ఎగతాళి చేశారని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు ఆటోరిక్షానే మెర్సిడెజ్‌ను వెనక్కి నెట్టిందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం, సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రభుత్వమని భావించే విధంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

బీజేపీ మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని త్రీవీలర్ ప్రభుత్వం అని పిలిచేదని, అయితే ఇప్పుడు త్రీవీలర్ నడిపిన వ్యక్తి ప్రభుత్వాన్ని నడుపుతున్నాడని అన్నారు. షిండే తనను వెన్నుపోటు పొడిచారని కూడా ఠాక్రే ఆరోపించారని ఆయన వెల్లడించారు. షిండే శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. తన ప్రారంభ రోజుల్లో సీఎం షిండే జీవనోపాధి కోసం ఆటో రిక్షా నడిపారు.ఉద్ధవ్ థాకరే బలపరీక్షకు ముందే సీఎం పదవికి రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌కు రాజీనామా సమర్పించేందుకు ఉద్ధవ్ ఠాక్రే మెర్సిడెస్ కారులో రాజ్‌భవన్‌కు వచ్చారు. దీంతో మెర్సిడెస్ కారును ఆటోరిక్షా అధిగమించిందని సీఎం షిండే మరాఠీలో ట్వీట్ చేశారు.

అధికారం కోసం బీజేపీ ఏదైనా చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. కానీ ఈ 50 మంది హిందుత్వ వైఖరిని, సైద్ధాంతిక వైఖరిని తీసుకున్నారని.. వారి ఎజెండా అభివృద్ధి , హిందుత్వమేనని దేశానికి నిరూపించారన్నారు. బీజేపీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికి తమకు మద్దతు ఇచ్చారని షిండే అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ తనకు చెప్పారని షిండే చెప్పారు. అభివృద్ధి పనులకు కేంద్రం సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. తాము చట్టవిరుద్ధంగా ఏమీ చేయలేదని.. ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య పొత్తు కుదిరిందన్నారు.

Vijay Vasanth Pen: నా.. పెన్ను పోయింది ! పోలీస్టేష‌న్‌లో కేసుపెట్టిన ఎంపీ.. దాని విలువ ఎంతంటే? 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 200 సీట్లు గెలుచుకుంటుందన్న వ్యాఖ్యలపై షిండేను ప్రశ్నించగా, 170 మంది ఎమ్మెల్యేలు కూటమితో ఉన్నారని, ఇంకా 30 మంది మాత్రమే మిగిలి ఉన్నారని అన్నారు. 200కు పైగా సీట్లు తెచ్చుకోగలం అని అన్నారు. భాజపా నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ గొప్ప మనస్సుతో ఉప ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం అనూహ్యమని.. తాను అధిష్ఠానం ఆదేశాలను పాటించారన్నారు. మంత్రివర్గ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.