మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మరాఠీ భాష మాట్లాడలేదన్న కారణంతో ఆటో డ్రైవర్‌పై కొందరు భౌతికదాడికి దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: BHEL: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 10th అర్హతతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 515 జాబ్స్ రెడీ.. మంచి జీతం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవేష్ పడోలియా అనే ఆటో డ్రైవర్ మహారాష్ట్రకు వలస వచ్చాడు. అయితే తనకు మరాఠీ రాదని.. హిందీ మాత్రమే వచ్చని గతంలో వీడియో వైరల్ అయింది. దీంతో విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో శివసేన(యూబీటీ), ఎంఎన్‌ఎస్ మద్దతుదారుల బృందం అడ్డుకుంది. మరాఠీలో మాట్లాడేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. తనకు హిందీ మాత్రమే వచ్చని తెగేసి చెప్పాడు. దీంతో రైల్వేస్టేషన్‌లో అడ్డుకుని చితకబాదారు.
ఇది కూడా చదవండి: SS Rajamouli: ఎక్కడకొచ్చి ఏం చేస్తున్నావ్?.. రాజమౌళి అసహనం!
ఎవరైనా మరాఠీ మాట్లాడేందుకు నిరాకరిస్తే తమ శైలిలో బుద్ధి చెబుతామని శివసేన (యూబీటీ) విరార్ నగర్ చీఫ్ ఉదయ్ జాదవ్ హెచ్చరించారు. మరాఠీని అవమానిస్తే మౌనంగా కూర్చోలేమన్నారు. ఆటో డ్రైవర్.. మహారాష్ట్ర ప్రజల గురించి, మరాఠీ గురించి చెడుగా మాట్లాడే ధైర్యం చేశాడని తెలిపారు. రాష్ట్ర ప్రజలను బాధపెట్టినందుకు క్షమాపణ చెప్పాలని బలవంతం చేసినట్లు తెలిపారు.
అయితే ఈ ఘటనపై పాల్ఘర్ జిల్లా పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. వైరల్ వీడియోను చూశామని.. ప్రస్తుతానికి ఇరు పక్షాల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేని పోలీసులు చెప్పారు.
