ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన సంచలనం సృష్టించింది. తన బేకరీలో దినసరి కూలీగా పని చేస్తున్న ఆ బాలికపై బేకరీ యజమాని, మరో వ్యక్తి గత రెండు నెలలుగా అత్యాచారం చేస్తున్నారు. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కార్యకర్త మోయిద్ ఖాన్‌తో పాటు రాజు ఖాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
READ MORE: Hyderabad: ఘోర ప్రమాదం.. కేబుల్ బ్రిడ్జిపై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి
అయోధ్య జిల్లాకు చెందిన 12 ఏళ్ల అత్యాచార బాధితురాలి తల్లికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. లక్నోలోని ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన బాధితురాలి తల్లి మీడియాతో మాట్లాడుతూ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపింది. తాజాగా నిందితుడి ఇంటికి సీఎం యోగీ ఇంటికి బుల్‌డోజర్ పంపారు. ఇళ్లు నేలమట్టమైంది.
READ MORE:Hyderabad: అబిడ్స్లో అగ్నిప్రమాదం..
అత్యాచారం వేదనకు గురవుతున్న బాలిక మరెన్నో వేదనలను ఎదుర్కొంటోంది. 12 సంవత్సరాల వయస్సులో, ఆమె కడుపులో 12 వారాల పిండం పెరుగుతోంది. డెలివరీ లేదా అబార్షన్ రెండూ బాలికకు ప్రమాదమే. ఇప్పుడు వైద్యులు కూడా బాలిక ప్రాణాలను రక్షించే మార్గాలను అన్వేషిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కుటుంబ సభ్యుల సమ్మతి కోసం వేచి ఉన్నారు. బిడ్డకు ఇంకా ప్రసవ వయస్సు లేదు.. గర్భస్రావం 24 వారాల వరకు జరుగుతుంది. సాధారణ ప్రసవం ద్వారా పిండాన్ని తొలగించే ప్రయత్నం చేస్తామని జిల్లా మహిళా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆశారాం తెలిపారు.
ఈ ఘటన తర్వాత ఎస్పీ నేత మొయీద్‌ఖాన్ ఇంటికి బుల్‌డోజర్ చేరుకోనుంది. 630 చదరపు మీటర్ల శ్మశాన వాటిక భూమిని ఆక్రమించి మొయీద్ ఇల్లు కట్టుకున్నట్లు రెవెన్యూశాఖ విచారణలో తేలింది. అదేవిధంగా చెరువు భూమిలో, పబ్లిక్ రోడ్డులో నిర్మించిన రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ కూడా కూల్చివేయనున్నారు. రెవెన్యూ శాఖ విచారణ నివేదికను డీఎం చంద్ర విజయ్ సింగ్‌కు అందజేస్తామని సోహవాల్ డిప్యూటీ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ సైనీ తెలిపారు. అనంతరం అతడి ఇంటికి బుల్‌డోజర్ చేరుకుంటుంది.