Site icon NTV Telugu

Karnataka: బెలగావిలో ‘‘ఔరంగజేబు’’ పోస్టర్ కలకలం..

Aurangzeb

Aurangzeb

Karnataka: కర్ణాటకలో మరోసారి ఔరంగజేబ్ పోస్టర్లు కలకలం రేపాయి. బెలగావిలో షాహు నగర్ ప్రాంతంలో ఔరంగజేబ్ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు పెట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఔరంగజేబ్‌ని ‘‘సుల్తాన్-ఏ-హింద్’’, ‘‘అఖండ భారత్ నిజమైన స్థాపకుడు’’ అని అభివర్ణించే పోస్టర్లనున ఆయన జయంతి సందర్భంగా ఉంచారు.

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. భారత్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!

అయితే, ఈ పోస్టర్లు స్థానికంగా ఉద్రిక్తత కలిగించాయి. స్థానికుల నిరసన మధ్య బ్యానర్లను తీసివేసి, ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత పెంచారు. స్థానికులు బ్యానర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు, మత ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నంగా భావించినందుకు బాధ్యులపై త్వరగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే, బ్యానర్లను తీసివేయడంపై మరో వర్గానికి చెందిన యువకులు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేశారు. పక్కనే ఉన్న హిందూ జాతీయవాద నేత వీర్ సావర్కర్ బ్యానర్‌ని తాకకుండా, ఔరంగజేబ్ బ్యానర్లను తీసేయడం ఏంటని ప్రశ్నించారు. తమ బ్యానర్లను తీసేస్తే సహించేది లేదని హెచ్చరించారు. బెలగావిలోని లా అండ్ ఆర్డర్ డిప్యూటీ కమీషనర్ రోహన్ జగదీష్ పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నవంబర్ 3 ఔరంగజేబ్ పుట్టిన రోజున కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా పబ్లిక్ ఆస్తులపై పోస్టర్లు అంటించారు. కార్పొరేషన్ వీటిని తొలగించింది’’ అని పేర్కొన్నారు.

Exit mobile version