NTV Telugu Site icon

Garba Dance: గర్బా ఆడుతుండగా రాళ్లతో దాడి.. ఆకతాయిలను కట్టేసి కొట్టిన పోలీసులు

Garba Dance 1

Garba Dance 1

Garba Dance:దేశ వ్యాప్తంగా దసరా నవరాత్రులను ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కొందరు ఆకతాయిలు నవరాత్రుల సందర్భంగా గర్బా నృత్యం చేస్తున్న మహిళలపై రాళు రువ్వారు. వాళ్లను చెడగొట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని గుర్తించి పట్టుకున్నారు. అక్కడే వారిని పోల్ కు కట్టేసి చితకబాదిన ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది ఇప్పుడు వైర‌ల్ మారింది.

గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఉండెల గ్రామంలోని దేవాలయం ఆవరణలో గర్బా ఆడుతున్న మ‌హిళ‌ల‌పై దాదాపు 150 మంది గుంపు రాళ్లు రువ్వినట్లు ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది. కార్యక్రమాన్ని చెడగొట్టి వారి ఆనందాన్ని దెబ్బతీయాలని ఆకతాయిలు భావించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రాళ్లు రువ్వుతున్న వారిని చెడగొట్టారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఎవరూ యూనిఫాం ధరించిలేరు. ఒక్క పోలీసు మాత్రం గన్ పెట్టుకుని ఉండడం వీడియోలో కనిపిస్తోంది.

Read Also: Encounter: జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు ఖతం

ఆకతాయిల్లో ఒక్కొక్కరిని తీసుకొని వ‌చ్చి క‌రెంట్ పోల్ ద‌గ్గర నిలబెట్టారు. వారి చేతుల‌ను ఒక‌ పోలీసు పట్టుకోగా.. మరో పోలీస్ కర్రతో బాదారు. ఆ తర్వాత అక్కడున్న మహిళలకు క్షమాపణలు చెప్పించారు. నిందితుల‌ను పోలీసులు కొడుతున్న వీడియోను స్థానికులు వీడియో తీశారు. దీనిని బీజేపీ నాయ‌కులు, ఆ గ్రామ‌స్తులు సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అది వైర‌ల్ గా మారింది. అయితే పోలీసులు ఆక‌తాయిల‌ను కొడుతున్న వీడియో క్లిప్ ఏదీ తనకు కనిపించలేదని అహ్మదాబాద్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వీ చంద్రశేఖర్ చెప్పారు. పోలీసుల చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తే చ‌ర్యలు తీసుకుంటామని, ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రిపిస్తామ‌ని తెలిపారు. గ‌ర్భా వేదిక‌పై రాళ్లు రువ్విన ఘ‌ట‌నలో మాటర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ న‌మోదైంది. పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీఆర్ బాజ్‌పాయ్ తెలిపారు.