NTV Telugu Site icon

Priyanka Gandhi: ‘కన్వర్ యాత్ర’ రూల్స్ రాజ్యాంగంపై దాడి.. యూపీ సర్కార్‌పై ఫైర్..

Priyanka Gandhi

Priyanka Gandhi

Priyanka Gandhi:ఉత్తర్ ప్రదేశ్‌లో ‘కన్వర్ యాత్ర’ వివాదం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ముజఫర్ నగర్ జిల్లా నుంచి సాగే ఈ యాత్రకు పోలీసులు విధించిన రూల్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. యాత్రా మార్గంలోని పలు తినుబండారాల దుకాణాల యజమానులు వారి పేర్ల కనిపించేలా ప్రదర్శించాలని పోలీసులు ఆదేశించారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పి్స్తున్నాయి. పోలీసులు ఆదేశాలను ప్రియాంకాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ‘‘కులం మరియు మతం ఆధారంగా సమాజంలో విభజనను సృష్టించడం రాజ్యాంగ విరుద్ధమైన నేరం. ఈ ఉత్తర్వును తక్షణమే ఉపసంహరించుకోవాలి మరియు జారీ చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని ఆమె ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

Read Also: Minister RamMohan Naidu: విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.. కేంద్ర మంత్రి ఆదేశం

‘‘మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి కులం, మతం, భాష లేదా మరే ఇతర ప్రాతిపదికన వివక్ష చూపదని హామీ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని బండ్లు, దుకాణాల యజమానుల పేర్ల బోర్డులను ఉంచాలనే విభజన ఉత్తర్వులు మన రాజ్యాంగం, మన ప్రజాస్వామ్యం , మన భాగస్వామ్య వారసత్వంపై దాడి’’ అని ఆమె అన్నారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. దీనిని దక్షిణాఫ్రికా ‘‘వర్ణవివక్ష’’, హిట్లర్ నాజీల దురాగతంగా అభివర్ణించారు.

మరోవైపు మతపరమైనయ ఊరేగింపు సమయంలో గందరగోళాన్ని నివారించేందుకు అన్ని ఫుడ్ జాయింట్ల యజమానులు పేర్లను ప్రదర్శించాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు సమర్థించుకున్నారు. యాత్రికుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు శాంతిభద్రత సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముజఫర్ నగర్ జిల్లా ఎస్పీ అభిషేక్ సింగ్ అన్నారు. శివ భక్తుల వార్షిక తీర్థయాత్ర అయిన కన్వర్ యాత్ర జూలై 22న ప్రారంభమవుతుంది.