Site icon NTV Telugu

Jharkhand: టెర్రరిజం పై ఏటీఎస్ పంజా.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్..

Untitled 13

Untitled 13

Jharkhand: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత మంది యువత తప్పు దారి పడుతుంది. యువతను టార్గెట్ చేస్తూ ఉగ్రవాద సంస్థలు వాళ్ళ బోధనలతో యువత ఆలోచనను తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో టెర్రిస్టులు పుట్టుకొస్తున్నారు. దీనితో టెర్రరిజం పైన ద్రుష్టి సారించింది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్). ఈ క్రమంలో జార్ఖండ్ రాష్ట్రంలో టెర్రరిజం పై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్ ఆ సమాచారం ఆధారంగా గొడ్డా, హజారీ జిల్లాల్లో ఆపరేషన్‌ నిర్వహించింది. కాగా అరెస్టయిన వారిని గొడ్డా జిల్లా లోని అస్బానాని నివాసి మహ్మద్ అరిజ్ హుస్సేన్ అలానే హజారీబాగ్ జిల్లా పెలావల్ నివాసి నసీమ్‌గా గుర్తించారు.

Read also:Singham Again : వైరల్ అవుతున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్..

మహ్మద్ అరిజ్ హుస్సేన్ సోషల్ మీడియా వేదికగా యువతతో పరిచయం ఏర్పరుచుకుంటున్నాడు. అనంతరం తన భావజాలంతో యువతలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తునాడు. అయితే ఇతను ఉగ్రవాదుల భావజాలానికి ప్రభావితమై ఇలా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నట్లు సమాచారం. కాగా హుస్సేన్‌తో అనుమానాస్పద సందేశాలు షేర్ చేసిన నసీమ్‌ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కాగా విచారణలో.. పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్‌ లోని వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థలతో తాను టచ్‌లో ఉన్నట్లు హుస్సేన్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కౌంటర్ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు మాట్లాడుతూ.. జిహాద్, ఐఎస్ఐఎస్ భావజాలంతో కూడిన రెండు పుస్తకాలను నసీం హుస్సేన్‌కు పంపినట్లు తెలిపారు. . నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేసిన ఏటీఎస్ అధికారులు.. దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version