NTV Telugu Site icon

AAP: ఆప్‌కి మరో షాక్.. పరువునష్టం కేసులో మంత్రి అతిషీకి కోర్టు సమన్లు..

Aap

Aap

AAP: ఢిల్లీ లిక్కర్ కేసు, స్వాతి మలివాల్‌పై దాడి కేసుల్లో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మరో షాక్ తగిలింది. ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు పరువు నష్టం కేసులో సమన్లు జారీ చేసింది. లంచం ఇచ్చి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆమె ఆరోపించింది. దీనిపై ఢిల్లీ బీజేపీ మీడియా హెచ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు నమోదు చేశారు. జూన్ 29న కోర్టు ముందు హాజరుకావాలని అతిషీని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా చేర్చిన ప్రవీణ్ శంకర్ కపూర్.. ఈ ఆరోపణలు తన పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు అతిషీని నిందితురాలిగా గుర్తించి, జూన్ 29న హాజరుకావాలని ఆదేశించింది.

Read Also: Smartphone Theft: మీ ఫోన్ ఎవరైనా కొట్టేశారా? ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే!

బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించినట్టు తగిన ఆధారాలు చూపించ లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 30న బీజేపీ పరువునష్టం కేసును దాఖలు చేసింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ని బీజేపీ కేసులో పేర్కొంది. బీజేపీ ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు, పార్టీ మారేందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసిందన ఆయన ఆరోపించారు. ఆప్ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. తనను పార్టీ మారడానికి బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, లేని పక్షంలో ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆమె ఆరోపించారు. బీజేపీ సన్నిహితులు తనను సంప్రదించారని, వారు నన్ను బీజేపీలో చేరాలని కోరారని, ఇది తన రాజకీయ జీవితాన్ని కాపాడుతుందని చెప్పారని, మారకపోతే ఈడీ నెల రోజుల్లో తనను అరెస్ట్ చేస్తుందని బెదిరించారని ఆమె ఏప్రిల్‌లో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా, దుర్గేష్ పాఠక్ కూడా త్వరలో అరెస్ట్ చేయబడుతారని ఆమె పేర్కొంది. అతిషి చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని, టీవీ, సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు తన పిటిషన్‌లో కోరారు.