NTV Telugu Site icon

Yogi Adityanath: మాఫియాకు సింహస్వప్నంగా యోగి.. 10 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు.. ఫేమస్ ఎన్‌కౌంటర్లు లిస్ట్ ఇదే..

Yogi 1

Yogi 1

Yogi Adityanath: మాఫియా, ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డాగా ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ఏళ్లపాటు ఉంది. అయితే ప్రస్తుతం ఇది మారుతోంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్లు రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు. తాజాగా నేరసామ్రాజ్యంలో వినిపిస్తున్న అతిక్ అహ్మద్ కూడా గతంలో ఐదుసార్లు సమాజ్ వాదీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరసగా యూపీ పోలీసులు మాఫియా, గ్యాంగ్ స్టర్లను లేపేస్తున్నారు. క్రైమ్ ఫ్రీ యూపీగా పోలీసులు పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీస్ ఎన్ కౌంటర్లలో 183 మంది నేరస్తులు మరణించారు. తాజాగా ఈ రోజు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను పారిపోతున్న సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ టీం మట్టుబెట్టింది.

యోగి హయాంలో యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లు ఇవే..

2017 నుండి ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు

ఉత్తర్ ప్రదేశ్ లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10,713 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో 183 మంది నేరస్తులు హతం అయ్యారు. చనిపోయిన అందరిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. వీరందరిపై రూ. 75,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు రివార్డు ఉంది. ఆరేళ్లలో ప్రతీ 13 రోజులకు కనీసం ఒక నేరస్తులు చనిపోయాడు. మార్చి 20, 2017 మరియు మార్చి 6, 2023 మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ల తరువాత 23,069 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 4,911 మంది గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు మరణించారు. 2017లో 28 మంది, 2018లో 41 మంది, 2019లో 34 మంది, 2020 లో 26 మంది, 2021లో 26 మంది, 2022లో 14 మంది, ఈ ఏడాది మార్చి వరకు పోలీసు ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది నేరస్థులు మరణించారు.

 

 

Show comments