Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Atiq Ahmeds Son Asad Killed A Look At Encounters Under Yogi Govt In Up

Yogi Adityanath: మాఫియాకు సింహస్వప్నంగా యోగి.. 10 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు.. ఫేమస్ ఎన్‌కౌంటర్లు లిస్ట్ ఇదే..

Published Date :April 13, 2023 , 8:32 pm
By Venu Goapl Reddy
Yogi Adityanath: మాఫియాకు సింహస్వప్నంగా యోగి.. 10 వేలకు పైగా ఎన్‌కౌంటర్లు.. ఫేమస్ ఎన్‌కౌంటర్లు లిస్ట్ ఇదే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Yogi Adityanath: మాఫియా, ఉగ్రవాదులు, నేరస్తులకు అడ్డాగా ఉత్తర్ ప్రదేశ్ కొన్ని ఏళ్లపాటు ఉంది. అయితే ప్రస్తుతం ఇది మారుతోంది. గతంలో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గ్యాంగ్ స్టర్లు రాజకీయ నాయకులుగా చలామణి అయ్యారు. తాజాగా నేరసామ్రాజ్యంలో వినిపిస్తున్న అతిక్ అహ్మద్ కూడా గతంలో ఐదుసార్లు సమాజ్ వాదీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచాడు. అయితే యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వరసగా యూపీ పోలీసులు మాఫియా, గ్యాంగ్ స్టర్లను లేపేస్తున్నారు. క్రైమ్ ఫ్రీ యూపీగా పోలీసులు పనిచేస్తున్నారు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు పోలీస్ ఎన్ కౌంటర్లలో 183 మంది నేరస్తులు మరణించారు. తాజాగా ఈ రోజు గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్ ను పారిపోతున్న సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎస్టీఎఫ్ టీం మట్టుబెట్టింది.

యోగి హయాంలో యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లు ఇవే..

  • గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే జూలై 10, 2020న కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉజ్జయిని నుండి కాన్పూర్‌కు దూబేను తీసుకువెళుతున్న పోలీసు వాహనం బోల్తాపడటంతో ఎన్‌కౌంటర్ జరిగింది మరియు గ్యాంగ్‌స్టర్ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
  • జూలై 25, 2020న, గ్యాంగ్‌స్టర్ టింకు కపాలా బారాబంకిలో యూపీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్‌లో హతం అయ్యాడు.
  • అక్టోబర్ 18, 2021న లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో బంగ్లాదేశ్ గ్యాంగ్‌స్టర్ హమ్జా మరణించాడు.
  • సిధ్‌పురా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ను హత్య చేసి, అంతకుముందు కాస్‌గంజ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌ను గాయపరిచినట్లు నేరంలో నిందితుడిగా ఉన్న మోతీ సింగ్ ఫిబ్రవరి 21, 2021న రాష్ట్ర పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారు.
  • సెప్టెంబర్ 30, 2022న, జౌన్‌పూర్ పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ వినోద్ కుమార్ సింగ్ మరణించాడు. ఇతడిపై లక్ష రూపాయల రివార్డ్ ఉంది.
  • మార్చి 21, 2022న వారణాసి (రూరల్)లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (UPSTF)తో జరిగిన ఎదురుకాల్పుల్లో మనీష్ సింగ్, అలియాస్ సోను హతం అయ్యాడు. ఇతడిపై 32 కేసులు ఉన్నాయి. ఏడు హత్య కేసులు, ఐదు హత్యాయత్నం దోపిడి సహా నేరారోపణలు ఉన్నాయి.
  • మాఫియాగా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ మరియు ఉమేష్ పాల్ హత్య కేసులో వాంటెడ్ గా ఉన్న మక్సుదాన్ కుమారుడు గులాం ఈరోజు ఝాన్సీ వద్ద ఎస్టీఎఫ్ బృందంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇద్దరిపై ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉంది.

2017 నుండి ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు

ఉత్తర్ ప్రదేశ్ లో యోగి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10,713 ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో 183 మంది నేరస్తులు హతం అయ్యారు. చనిపోయిన అందరిపై తీవ్రమైన నేరాలు ఉన్నాయి. వీరందరిపై రూ. 75,000 నుంచి రూ.5 లక్షల వరకు నగదు రివార్డు ఉంది. ఆరేళ్లలో ప్రతీ 13 రోజులకు కనీసం ఒక నేరస్తులు చనిపోయాడు. మార్చి 20, 2017 మరియు మార్చి 6, 2023 మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ల తరువాత 23,069 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 4,911 మంది గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు మరణించారు. 2017లో 28 మంది, 2018లో 41 మంది, 2019లో 34 మంది, 2020 లో 26 మంది, 2021లో 26 మంది, 2022లో 14 మంది, ఈ ఏడాది మార్చి వరకు పోలీసు ఎన్‌కౌంటర్లలో తొమ్మిది మంది నేరస్థులు మరణించారు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Asad encounter
  • Up encounters
  • UP Police
  • Uttar Pradesh
  • Yogi Adityanath

తాజావార్తలు

  • Insurance Price: తగ్గనున్న ఇన్సురెన్స్ ప్రీమియం ధరలు.. మోటార్, హెల్త్, లైఫ్ ఇన్సురెన్స్‌లు ఇక తక్కువ ధరలోనే..

  • US-Iran ceasefire: అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్..

  • Nayan Sarika: ‘రాకాసా’తో మరో హిట్ ఖాతాలో వేసుకున్న క్రేజీ బ్యూటీ..

  • Village Volunteer: ‘ప్రతీ గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమిస్తాం’: మంత్రి తుమ్మల

  • Cameron Green Trolls: 18, 2, 4.. 25 కోట్లు బొక్క.. కామెరూన్‌ గ్రీన్‌ను ఎలిమినేట్ చేయండి సర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions