Site icon NTV Telugu

Karnataka: బొట్టుపెట్టుకోలేదని మహిళను తిట్టిన బీజేపీ ఎంపీ.. మహిళా దినోత్సవం రోజే అవమానం

Bjp

Bjp

Karnataka: మహిళా దినోత్సవం రోజు ఓ మహిళకు అవమానం ఎదురైంది. బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళను బహిరంగంగా తిట్టారు బీజేేపీ ఎంపీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీ తీరును, బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది.

Read Also: Phone charger in socket: మొబైల్ చార్జర్ ఎన్ని యూనిట్ల కరెంట్ వినియోగిస్తుందో తెలుసా?

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక బీజేపీ నేత, కోలార్ ఎంపీ ఎస్ మునిస్వామి జిల్లాలో పర్యటిస్తున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మహిళల సేల్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఒక దుకాణం వద్ద వస్తువులను విక్రయిస్తున్న మహిళ యజమాని నుదిటిపై బొట్టు లేకపోవడంతో ఎంపీ బహిరంగంగా తిట్టారు. మొదటగా బొట్టు పెట్టుకోండి.. మీ భర్త బతికే ఉన్నాడు కదా..? మీకు ఇంగితజ్ఞానం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మరికొన్ని రోజుల్లో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇది కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా మారింది. ఈ ఘటన బీజేపీ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బీజేపీ మహిళలకు గౌరవం ఇవ్వదంటూ ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

Exit mobile version