NTV Telugu Site icon

Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. 5 నెలల గరిష్టానికి రోజువారీ కేసులు

Corona 19

Corona 19

Covid-19: దేశంలో కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా 5 నెలల గరిష్టానికి రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 1,890 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో ముగ్గురు మరణించారు.

Read Also: CM KCR: నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ఇదే..

చివరిసారిగా గతేడాది ఒకే రోజు 2,208 కేసులు నమోదు కాగా.. దాదాపుగా 149 రోజుల తర్వాత 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433గా ఉంది. డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు అయింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. దేశంలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.47 కోట్లు(4,47,04,147)గా కేసులు నమోదు అయ్యాయి. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య ,41,63,883కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ద్వారా 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించింది.

Show comments