Site icon NTV Telugu

తాజా ప‌రిశోధ‌నః రెండు డోసుల మ‌ధ్య 45 వారాల విరామం ఉంటే…

క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టాలి అంటే క‌రోనా వ్యాక్సిన్ తీసుకోవాలి.  ప్ర‌స్తుతానికి వ్యాక్సిన్ ఒక్క‌టే మార్గం కావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.  ఇక మ‌న‌దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి.  కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిట‌న్‌లోని లండ‌న్ విశ్వ‌విద్యాల‌యం కీల‌క‌మైన ప‌రిశోధ‌న చేసింది.  వ్యాక్స‌న్ మొద‌టి, రెండో డోసుల మ‌ధ్య ఎంత గ్యాప్ ఉంటే శ‌రీరంలో యాంటీబాడీలు స‌మ‌ర్ధ‌వంతంగా పెరుగుతాయ‌నే దానిపై ప‌రిశోధ‌న‌లు చేశారు.  ఈ ప‌రిశోధ‌న‌లో ఆస‌క్తిక‌రమైన విష‌యాలు వెలుగుచూశాయి.  

Read: అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్

కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొద‌టి డోసు తీసుకున్న 45 వారాల వ్వ‌వ‌ధి త‌రువాత రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే, వారిలో యాంటీబాడీలు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  రెండో డోసు తీసుకున్న 28 రోజుల త‌రువాత యాంటీబాడీల స్పంద‌న 18 రెట్లు అధికంగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలిన‌ట్లు చెబుతున్నారు.  అదేవిధంగా రెండు డోసుల తీసుకున్న ఆరు నెల‌ల త‌రువాత మూడో డోస్ తీసుకోవ‌చ్చ‌ని మూడో డోసు వ్యాక్సిన్ తీసుకుంటే శ‌రీరంలో యాంటీబాడీలు ఆరురెట్లు అధికం అవుతాయ‌ని, వ్యాధినిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది.  ఇండియాలో రెండు డోసుల మ‌ధ్య 12 నుంచి 16 వారాల వ్వ‌వ‌ధిగా నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే.  

Exit mobile version