అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్

యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ప్రియులకు ఇష్టమైన కార్ రేసింగ్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్”. ఈ సిరీస్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో నటించిన “ఎఫ్ 9” చిత్రం యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా జూన్ 25న రిలీజ్ అయింది. ఇంటర్నేషనల్ గా మే 19న విడుదలైన ఈ మూవీ కరోనా కారణంగా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఇటీవల కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఎట్టకేలకు జూన్ 25న థియేటర్ లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. అయితే ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ లో భాగంగా “ఎఫ్ 10” ఉంటుందని ప్రకటించేశారు మేకర్స్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమా హీరో విన్ డీజిల్ మాట్లాడుతూ ‘ఎఫ్9 ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ‘ఎఫ్ 10’కు సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందని చెప్పారు.

Read Also : అజిత్ అభిమానులా మజాకా… ట్రెండ్ సెట్ చేసేస్తున్నారుగా…!

అంతేకాదు “ఎఫ్10” రెండు భాగాలుగా రాబోతుందని, ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ ఎండ్ అవుతుందని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ జస్టిన్ లిన్ ఈ రెండు పార్ట్ లను తెరకెక్కించబోతున్నారు. ఇందులో విన్ డీజిల్ తో సహా ‘ఎఫ్9’లో నటించిన ప్రధాన తారాగణం మొత్తం నటించనున్నారు. ఒక్క జాన్ సెనా మినహా…! ‘ఎఫ్ 9’ లో లిసా ​​పాత్రలో నటించిన కార్డి బి సీక్వెల్ లో కూడా నటించనుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమాపై మరో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అది ఏంటంటే షూటింగ్ 2012 జనవరి నుంచి ప్రారంభం కానుందని కన్ఫామ్ చేశారు. ఇక రెండు భాగాలతో “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్” ఫ్రాంచైజ్ ఎండ్ కావడం కార్ రేసింగ్ మూవీ అభిమానులను నిరాశ పరిచే విషయం.

-Advertisement-అఫిషియల్ : "ఫాస్ట్10" షూటింగ్ కు టైమ్ ఫిక్స్

Related Articles

Latest Articles