NTV Telugu Site icon

Jharkhand: రోడ్డెక్కిన అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది.. జీతాలు పెంచాలని నిరసన

Jharkhand

Jharkhand

జార్ఖండ్‌లో అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనకు పూనుకున్నారు. తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని రాంచీకి భారీగా పోలీస్ సిబ్బంది తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీలకు పని చేశారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారుల్ని చెదరగొట్టారు. తమకు జీతాలు పెంచాలని నినాదాలు చేశారు.

ఇది కూడా చదవండి: IAS Puja Khedkar: ట్రైనీ ఐఏఎస్ పై కేసు..అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ

ఇటీవలే హేమంత్ సోరెన్ మూడోసారి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే కేబినెట్ విస్తరణ చేశారు. గత వారం ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, సోనియాగాంధీ, సునీతా కేజ్రీవాల్‌ను కలిసి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో 5 నెలల జైలు జీవితం అనంతరం ఆయన తిరిగి సీఎం పీఠాన్ని అధిరోహించారు. త్వరలోనే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం అసిస్టెంట్ పోలీస్ సిబ్బంది నిరసనలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Odisha: వైద్యం పేరుతో మహిళ తలలో 18 సూదులు గుచ్చిన తాంత్రికుడు..