Bihu Dance Enters Guinness Book Of World Records: భారతదేశంలోని అస్సాం రాష్ట్రానికి చెందిన ‘బిహు నృత్యం’ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. అస్సాంలో గురువారం ఒకే వేదికపై బిహు నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నానికి గుర్తింపు లభించింది. 11,000 మంది కళాకారులు, డ్రమ్మర్లు, నృత్యకారులతో సహా గౌహతిలోని సరుసజై స్టేడియంలో పాల్గొన్నారు.
Read Also: Plane Crash: 1976లో విమాన ప్రమాదం..సీఎంతో సహా 10 మంది మృతి.. 47 ఏళ్ల తర్వాత నిజం తెలిసింది..
అస్సాం సంప్రాదాయ వాయిద్యాలు అయిన ధోల్, ధోల్, తాల్, గోగోనా, టోకా, పెపా, జుతులి వంటి వాటిని వాయించే సంగీత కళాకారులు ఇందులో పాల్గొన్నారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం ఉత్తమ ప్రదర్శనకారులను తీసుకురావడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్ ట్రైనర్లు, డ్యాన్సర్లతో సహా, పాల్గొన్న ప్రతీ ఒక్కరూ రూ. 25,000 గ్రాంట్ అందుకోనున్నారు. రాష్ట్ర వసంతోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం అస్సాంకు వెళ్లనున్న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందుకోనున్నారు. అంతకుముందు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఒకే వేదికపై అతిపెద్ద బిహు నృత్య ప్రదర్శనను నిర్వహించడం, జానపద-నృత్యం విభాగంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరడమే లక్ష్యం అని చెప్పారు.