Site icon NTV Telugu

Junmoni Rabha: “లేడీ సింగం”గా పేరొందిన జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మృతి

Junmoni Rabha

Junmoni Rabha

Junmoni Rabha: అస్సాంకు చెందిన వివాదాస్పద లేడీ పోలీస్ జున్మోని రభా రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంగళవారం తెల్లవారుజామున నాగావ్ జిల్లాలో కంటైనర్ ట్రక్కును ఆమె కారు ఢీకొడడంతో మరనించినట్లు అధికారు తెలిపారు. డేరింగ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ గా ‘‘లేడీ సింగం’’, ‘‘దబాంగ్ పోలీస్’’గా పేరు తెచ్చుకున్న ఆమె తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘనట జరిగింది. కలియాబోర్ సబ్ డివిజన్ పరిధిలోని జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభుగియా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

తెల్లవారుజామున 2:30 గంటలకు సమాచారం అందుకున్న పోలీసు పెట్రోలింగ్ పార్టీ సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణం అయిన ఉత్తర్ ప్రదేశ్ నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు వెల్లడించారు. నాగావ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా డోలీ ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Read Also: Gautam Adani: 5,800 మీటర్ల నుంచి పడిపోయిన పర్వతారోహకుడికి గౌతమ్ అదానీ సహాయం

అయితే, ఎస్ జన్మోని రభా ఎలాంటి సెక్యురిటీ లేకుండా సివిల్ దుస్తుల్లో ఒంటరిగా తన ప్రైవేటు వాహనంలో ఎగువ అస్సాం వైపు ఎందుకు వెళ్తున్నారనే విషయం పోలీసులకు అంతుచిక్కడం లేదు. మొరికోలాంగ్ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న జున్మోని రాభా, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడంతోపాటు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారు. గతేడాది జూన్ నెలలో అవినీతి ఆరోపణలతో ఆమె సస్పెండ్ అయింది. సస్పెండ్ ఎత్తేయడంతో మళ్లీ విధుల్లో చేరింది.

జనవరి 2022లో బిహ్‌పురియా నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె టెలిఫోనిక్ సంభాషణ లీక్ కావడంతో ఆమె మరో వివాదంలో చిక్కుకుంది. ఈ ఆడియో లీక్ కావడంతో.. సీఎం హిమంత బిశ్వసర్మ స్పందిస్తూ..ఎన్నికైన ప్రజాప్రతినిధికి గౌరవం ఇవ్వాలని సూచించారు. ఉద్యోగాలతో మోసం చేస్తున్న కాబోయే భర్తను అరెస్ట్ చేసిన రభా ప్రశంసలు అందుకున్నారు.

Exit mobile version