NTV Telugu Site icon

Himanta Biswa Sarma: హిందూ అమ్మాయిలు ఎమోషనల్.. “లవ్ జీహాద్”పై కఠిన చట్టం అవసరం

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Assam CM Himanta Biswa Sarma’s key comments on Shraddha’s case: ఢిల్లీ శ్రద్దా వాకర్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా గొంతుకోసి చంపేశాడు. మే నెలలో జరిగిన ఈ దారుణహత్య, శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో గత వారం వెలుగులోకి వచ్చింది. శ్రద్ధా మృతదేహాన్ని 35 భాగాలుగా చేసి, 18 రోజుల పాటు రోజూరాత్రి ఢిల్లీ సమీపంలోని ఛత్తార్ పూర్ అటవీ ప్రాంతంలో పారేసినట్లు నిందితుడు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు.

ఇదిలా ఉంటే ఈ హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. బీజేపీకి చెందిన పలువురు నేతలు శ్రద్ధా మరణాన్ని ‘‘లవ్ జీహాద్’’గా అభివర్ణిస్తున్నారు. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, శ్రద్ధా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. శ్రద్ధావాకర్ మరణాన్ని ‘లవ్ జీహాద్’ అని అన్నారు. అఫ్తాబ్, శ్రద్ధాను చంపి 35 ముక్కులుగా నరికాడని.. శ్రద్ధాను పెళ్లి పేరుతో ముంబై నుంచి ఢిల్లీ తీసుకెళ్లాడని.. పెళ్లి చేసుకోలేదని, అయితే శరీరాన్ని ముక్కలుగా చేసి శరీరాన్ని ఫ్రిజ్ లో పెట్టాడని అన్నారు.

Read Also: Madras Eye: తమిళనాడును కలవరపెడుతున్న “మద్రాస్ ఐ” .. ప్రతిరోజూ 4 వేలకు పైగా కేసులు

అయితే హిందూ అమ్మాయినే ఎందుకు తీసుకువచ్చావని పోలీసులు అడిగితే.. వారు ఎమెషనల్ కాబట్టే ఇలా చేశానని అఫ్తాబ్ చెప్పాడని హిమంత బిశ్వ శర్మ అన్నారు. ఇది ఒక్క కేసే కానది.. ఇలాంటి అఫ్తాబ్-శ్రద్ధాలు దేశవ్యాప్తంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకూడదంటే.. ‘లవ్ జీహాద్’పై కఠిన చట్టాలు తీసుకురావాలని, ఇది కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.

శ్రద్ధా హత్య కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. శ్రద్ధాకు సంబంధించిన ఎముకలు, అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు ఆనవాళ్లను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబుకు డీఎన్ఏ పరీక్ష కోసం పంపారు. నిందితుడు అఫ్తాబ్ కు నార్కో పరీక్షలకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. మరో కొన్ని రోజుల్లో డీఎన్ఏ ఫలితాలు రానున్నాయి. ఈ డీఏఎన్ఏ శ్రద్ధా తండ్రితో సరిపోలితే.. కేసు మరింత బలపడే అవకాశం ఉంది.