NTV Telugu Site icon

CM and His Wife Dance With Schoolchildren: విద్యార్థులతో కలిసి సీఎం స్టెప్పులు.. ఆయన భార్య కూడా ఆగలేకపోయింది..

Assam

Assam

CM and His Wife Dance With Schoolchildren: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాఠశాల విద్యార్థులతో కలిసి ఒక కార్యక్రమంలో సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి తన డ్యాన్స్ వీడియోను కూడా పంచుకున్నారు.. ఝుమూర్‌ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు సీఎం.. హతింగా టీఈ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్‌’ ప్రదర్శన ఇచ్చారు.. ఇక, విద్యార్థుల నృత్యాన్ని చూసి ఆగలేకపోయిన ఆయన.. వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు.

Read Also: Gautam Gambhir: సూర్యకుమార్‌పై గౌతమ్ ట్వీట్.. మండిపడుతున్న ఫ్యాన్స్

విద్యార్థులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్‌ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. వారితో కలిసి కాలు కదిపారు.. స్టెప్పులేశారు. సీఎం స్టెప్పులను చూసి.. మరికొందరు విద్యార్థినిలు స్టేజ్‌పై చేరుకున్నారు.. ఇక, అక్కడే ఉన్న సీఎం భార్య రింకీ భూయాన్‌ శర్మ కూడా వాళ్లతో కలిసి కాలు కదిపారు.. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్‌ మాన్‌కీ, ప్రముఖ సింగర్‌ గీతాంజలి దాస్‌ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. సీఎం షేర్‌ చేసిన ఆ వీడియోలో.. సీఎం శర్మ మరియు అతని భార్య రినికి భుయాన్ శర్మ ఇద్దరూ పాఠశాల పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉల్లాసపరుస్తున్నట్లు గమనించవచ్చు.. సీఎం సాయంత్రం నుండి అనేక ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ వచ్చారు.. “సూటియాలోని హటింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థినులు, నా భార్యతో కలిసి నా నివాసంలో విద్యార్థులతో ముఖాముఖి.. వారికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఝుమూర్, తుసు నృత్యం, జానపద పాటలు పాడటం, జ్యోతి సంగీతం, పారాయణం చేయడం ద్వారా ఈ సాయంత్రం చిరస్మరణీయంగా మారింది.. అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు హిమంత బిస్వా శర్మ.