Site icon NTV Telugu

Aurangzeb’s tomb: ఔరంగ‌జేబు స‌మాధి మూసివేత..

Aurangzeb's Tomb

Aurangzeb's Tomb

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ పర్యటనపై వివాదం అయిన తర్వాత మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని 5 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది భారత పురావస్తు శాఖ.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని ఇటీవల అక్బరుద్దీన్ ఒవైసీ సందర్శించడంపై మహారాష్ట్రలో భారీ వివాదం నెలకొంది.. ఈ నేపథ్యంలో స్మారక చిహ్నాన్ని పరిరక్షిస్తున్న భారత పురావస్తు శాఖ ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అంతకుముందే మసీదు కమిటీ ఆ స్థలాన్ని తాళం వేయడానికి ప్రయత్నించింది.. కానీ, మేం దానిని తెరిచాము. ఇప్పుడు ఐదు రోజుల పాటు సమాధిని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని .. పరిస్థితిని సమీక్షించి, దానిని తెరవాలని లేదా మరో ఐదు రోజులు మూసి ఉంచాలా అనేదానిపై నిర్ణయం తీసుకుంటామని పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ ప్రసాద్ చౌలే వెల్లడించారు.

Read Also: Beeda Masthan Rao: చంద్రబాబు నన్ను బలిపశువును చేశారు..!

ఇక, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని ఐదు రోజుల పాటు మూసి ఉంచుతారు అని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పేర్కొన్న విషయం తెలిసిందే.. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) నాయకుడు గజానన్ కాలే చేసిన ట్వీట్ తర్వాత ఔరంగాబాద్‌లోని ఖుల్తాబాద్‌లోని ఒక మసీదు కమిటీ దానిని లాక్ చేయడానికి ప్రయత్నించిన తర్వాత పురావస్తుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.. ఆర్కియాల‌జీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ స‌మాధికి మ‌సీదు క‌మిటీ లాక్ చేయాల‌ని చూసింది.ఈ నేప‌థ్యంలో అక్కడ భారీ భ‌ద్రత‌ ఏర్పాటు చేశారు పోలీసులు..

Exit mobile version