NTV Telugu Site icon

LPG Cylinder Price: ఆ రాష్ట్రంలో సగం ధరకే గ్యాస్ సిలిండర్.. సీఎం కీలక నిర్ణయం.

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot Slashes LPG Cylinder Prices To Less Than Half In Rajasthan: ఎన్నికలు దగ్గర పడుతున్న రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. దేశవ్యాప్తంగా రాజస్థాన్, ఇటీవల గెలిచిన హిమాచల్ ప్రదేశ్ లోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజస్థాన్ లో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఇదిలా ఉంటే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు, ఉజ్వల పథకంలో చేరిన వారికి రూ.500కి వంటగ్యాస్ అందిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో సంచలన ప్రకటన చేవారు. రాహుల్ గాంధీ సమక్షంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాల్లో ప్రతీ ఒక్కరికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధర కన్నా తక్కువ ధరకే అందిస్తామని చెప్పారు.

Read Also: Google CEO Meets PM: ప్రధాని మోదీని కలిసిన సుందర్ పిచాయ్.. జీ-20కి మద్దతు

ప్రధాని నరేంద్ర మోదీ పేదవారికి ఉజ్వల పథకం కింద సిలిండర్ కనెక్షన్లను ఇచ్చాడని.. అయితే పెరుగుతున్న ధరల వల్ల సిలిండర్లు ఖాళీగానే ఉన్నాయని.. సిలిండర్ రేట్లు ప్రస్తుతం రూ. 400 నుంచి రూ. 1040 మధ్య ఉన్నాయని గెహ్లాట్ అన్నారు. పేదవారికి, ఉజ్వల పథకం కింద ఒక్కోక్కరికి రూ. 500 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని వెల్లడించారు.

వచ్చే ఏడాది రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే కాంగ్రెస్ అధికారం నిలుపుకోవాలని.. బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజస్థాన్ కాంగ్రెస్ లో వర్గపోరు ఆ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉంది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాల మధ్య వర్గపోరు నెలకొంది.