Site icon NTV Telugu

Ashok Gehlot: అసెంబ్లీలో గతేడాది బడ్జెట్ ప్రసంగాన్ని చదివిన ముఖ్యమంత్రి..

Ashok Gehlot

Ashok Gehlot

Ashok Gehlot: రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర వివాదానికి కారణం అయింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్ర బడ్జెట్ చదవడం ప్రారంభించిన తర్వాత ఇది గతేడాది బడ్జెట్ ప్రసంగం అని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సీఎం పాత బడ్జెట్ ను చదువుతున్నారని ఆరోపించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో సీఎం అశోక్ గెహ్లాట్ కొన్ని నిమిషాల పాటు పాత బడ్జెట్ ను చదివారు. ఎట్టకేలకు కాంగ్రెస్ మంత్రి మహేష్ జోషి తప్పును గ్రహించి సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్నారు.

Read Also: Bandi sanjay: సెక్రటేరియట్ పైన ఉన్న డోమ్‌లను కూల్చివేస్తాం.. బండిసంజయ్‌ సంచలన వ్యాఖ్యలు..

గెహ్లాట్ 2023-24 బడ్జెట్‌కు బదులుగా పట్టణ ఉపాధి మరియు కృషి బడ్జెట్‌పై మునుపటి బడ్జెట్ ను చదివారు. బడ్జెట్ కాపీని పొందడానికి ప్రభుత్వ అధికారులను హడావుడి చేయడంతోనే బడ్జెట్ లీక్ అయిందంటూ బీజేపీ ఛబ్రా ఎమ్మెల్యే గులాబ్ చంద్ కటారియా ఆరోపించారు. ముఖ్యమంత్రికి తప్పా మరెవరూ బడ్జెట్ కాపీని తీసుకోకూడదు, కానీ ఇక్కడ నాలుగురైదుగురు చేతిల్లోకి బడ్జెట్ వెళ్లిందని విమర్శించారు.

8 నిమిషాల పాటు సీఎం పాత బడ్జెట్‌ను చదువుతూనే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత వసుంధర రాజే ఆరోపించారు. నేను సీఎంగా పనిచేసిన సమయంలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పదేపదే పరిశీలించి చదివానని అన్నారు. పాత బడ్జెట్ చదివిని సీఎం చేతిలో రాష్ట్రం ఎంత భద్రంగా ఉందో ఊహించుకోవచ్చని ఆమె విమర్శించారు. కేంద్రమంత్రి, జోధ్ పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్ కూడా సీఎం అశోక్ గెహ్లాట్ పై విమర్శలు గుప్పించారు. గెహ్లట్ జీ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని.. ఈ ఏడాది బడ్జెట్ పై ప్రచారం చేసి పాత బడ్జెట్ చదివారని.. నవ్వాలో ఏడవాల్లో తెలియడం లేదని ట్వీట్ చేశారు.

Exit mobile version