Ashok Gehlot: కాంగ్రెస్‌లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- కాంగ్రెస్ అధ్యక్షుడిని కాకుండా నాపై కుట్ర..
- సంచలన వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సొంత పార్టీపై బాంబ్ పేల్చారు. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖాయం అయిన సమయంలో ఒక కుట్ర అన్నింటిని తలకిందులు చేసిందని ఆయన అన్నారు. ఈ నిజం ఇప్పటికీ ప్రజలకు తెలియదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కోసం ఎన్నికల గురించి చర్చ నడిచింది. ఆ సమయంలో సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అశోక్ గెహ్లాట్‌ను జాతీయాధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
ఈ విషయం గురించి మాట్లాడుతూ.. తాను దాదాపుగా కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతున్న సమయంలో, రాజస్థాన్ పరిస్థితుల్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పరిశీలకుల్ని పంపిందని, ఆ తర్వాత పరిస్థితి వేగంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఈ మొత్తం సంఘటన వెనక ఒక పెద్ద కుట్ర ఉందని, తనను కాంగ్రెస్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకుందని చెప్పారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఈ సమయంలో తాను రాజస్థాన్ సీఎం పదవి వదులుకునేందుకు ఇష్టం లేక అధ్యక్ష పదవిని వద్దనుకున్నట్లు ప్రజలు భావించారని, దేశవ్యాప్తంగా కూడా ఇదే పుకార్లు వ్యాపించాయని గెహ్లాట్ అన్నారు. తన సన్నిహితులు, మద్దతుదారులు కూడా ఇదే నమ్మారని చెప్పారు. ఈ కుట్ర తన ప్రతిష్టను దిగజార్చిందని చెప్పారు. కామరాజ్, మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి ప్రముఖ నాయకులను ఉదహరిస్తూ, కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష పదవికి ఎల్లప్పుడూ అత్యంత గౌరవం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!