Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో అత్యంత కీలకమై రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. అసదుద్దీన్ ఓవైసీకి చెందిన ఏఐఎంఐఎం పార్టీ, అప్నాదళ్(కామెరవాడి) మధ్య పొత్తు కుదిరింది. ప్రేమ్ చంద్ బింద్‌కి చెందిన ప్రగతిశీల మానవ్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీలతో సహా రాష్ట్రంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఈ కూటమిలో భాగంగా ఉన్నాయి. ఈ కూటమికి PDM అని పేరు పెట్టారు. దీని అర్థం ‘‘పిచ్డా(వెనకబడిన), దళిత్, ముస్లిం’’.
Read Also: Sunita Kejriwal: కేజ్రీవాల్ సింహం.. ఎక్కువ కాలం జైలులో ఉంచలేరు..
యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ(ఎస్పీ)తో అప్నాదళ్(కే) పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత ఎంఐఎంతో పొత్తు కుదిరింది. ఈ కూటమిలో సీట్ల పంపకాలపై రానున్న రోజుల్లో ప్రకటన వెలువడనుంది. ఇది కేవలం లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమే కాదని, ఉత్తర్ ప్రదేశ్ ప్రజల కోసమని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ‘‘మేము పల్లవి పటేల్‌తో పొత్తు పెట్టుకున్నామని, మేము మొదటిసారి కలిసినప్పుడు ఈ పోరాటాన్ని లోక్‌సభ ఎన్నికల వరకు మాత్రమే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ముందుకు తీసుకెళ్తాము’’ అని ఓవైసీ చెప్పారు.
అట్టడుగున ఉన్న దళిత ముస్లిం సమాజాంపై ప్రభుత్వ వైఖరిపై అప్నాదళ్(కే) నాయకురాలు పల్లవి పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయని ఆరోపించారు. పీడీఎం ఫ్రంట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ ఉద్యమంతో ముందుకు వచ్చిందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోక్‌సభ స్థానాల్లో అరంగ్రేటం చేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 జరిగే 7 దశల ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని 80 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
